ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం.. పలు కీలక అంశాలపై దాదాపు 2 గంటల పాటు చర్చించింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ కీలక కేంద్ర కేబినెట్ సమావేశం జరుగుతోంది. సమావేశం ఎజెండా ఇంకా వెల్లడి కానప్పటికీ, ప్రత్యేక సమావేశంలో పరిశీలన కోసం జాబితా చేయబడిన కీలక బిల్లులపై చర్చ జరిగే అవకాశం ఉంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ జరగనుంది.
ఢిల్లీలో నేడు కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరగబోతోంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశం జరుగుతుంది. ఈ నెల 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతుండడంతో కేబినెట్ ముందుకు ప్రత్యేక ఎజెండా రానుందని, పలు కీలక అంశాలు కూడా ఆమోదం పొందే అవకాశం ఉంది.
ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి వర్గ విస్తరణ మరో రెండు మూడు రోజుల్లో జరిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో కొత్త మంత్రులు పాల్గొనేలే బీజేపీ హైకమాండ్ నిర్ణయాలు తీసుకోవాలని భావించినట్లు తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ సమావేశాలకు ముందే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్‌లో పర్యటించనున్నారు.
ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి మంత్రులతో పాటు సహాయ మంత్రులను కూడా ఆహ్వానించారు.
MSP Increase: ఖరీఫ్ పంటలపై కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) పెంచుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. పెసర పంటకు 10.4 శాతం, వేరుశెనగ 9 శాతం , నువ్వులు శాతం, వరి 7 శాతం, సోయాబీన్, రాగులు, జొన్న, పొద్దు తిరుగుడు పంటకలకు సుమారుగా 6-7 శాతం…
కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా కిరణ్ రిజిజును గురువారం తొలగించారు. ప్రస్తుత కేబినెట్‌లో కిరణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు అతని ప్రస్తుత పోర్ట్‌ఫోలియోలకు అదనంగా న్యాయ మంత్రిత్వ శాఖలో స్వతంత్ర బాధ్యతలు అప్పగించబడ్డాయి.
డిజిటల్ ఇండియా కలను సాకారం చేసేందుకు కేంద్రం అన్ని విధాలా కృషి చేస్తోంది. ఇందులో భాగంగా తెచ్చిన డిజిటల్ చెల్లింపుల పర్యావరణాన్ని మరింత ప్రోత్సహించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది.