Central Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగాల కల్పన ప్రోత్సాహక పథకంకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక, కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అన్ని రంగాల్లో ఉద్యోగాల కల్పన, ఉద్యోగ కల్పనా సామర్థ్యం, సామాజిక భద్రత పెంచేందుకు సరికొత్త పథకం తీసుకొచ్చినట్లు తెలిపారు.
కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తాజాగా వయో పరిమితిని పెంచారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. విచారణలో ఈ వాదన తప్పు అని తేలింది. ఇంతకు ముందు కూడా ఇలాంటి వార్తలు వచ్చాయి. కానీ కేంద్ర ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును పెంచే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదని తెలిసింది.
Central Cabinet Meeting: నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది.
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంది. రైతుల ఆదాయం పెంచేందుకు, ఫుడ్ సెక్యూరిటీ కోసం పీఎం రాష్ట్ర వికాస్ యోజన తోపాటు కృషోన్నతి యోజన కోసం రూ.1,01,321 కోట్ల రూపాయలకు ఆమోదం తెలిపింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2028 నాటికి భారతదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ మేరుక ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ గతంలో కూడా వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఇస్రోకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఇందులో చంద్రయాన్-4, వీనస్ మిషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్, తదుపరి తరం ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేయడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.
పోలవరంకు సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలవరం మొదటి దశ నిర్మాణానికి అవసరమైన రూ. 12,500 కోట్ల ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో.. ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ, పోలవరం విషయంలో కేంద్రం చొరవ చూపుతోందని అన్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో కేంద్రం కట్టుబడి ఉందని తన చర్యల ద్వారానే చెబుతోందని తెలిపారు. కేంద్రం స్పందిస్తున్న తీరు చూస్తుంటే సంతోషం వేస్తోందని.. పోలవరాన్ని…
Waqf board: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మార్పులు తేవడానికి కొత్తగా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మసీదులు, ఇస్లాంలో సంబంధం ఉన్న ఆస్తుల్ని నిర్వహించే వక్ఫ్ బోర్డుల ‘‘అపరిమిత అధికారాలను’’ అరికట్టడానికి కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంటోంది.
వక్ఫ్ బోర్డు అధికారాలను కుదించే సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వార్తలొస్తున్నాయి. ఓ జాతీయ మీడియా సంస్థ సమచారం మేరకు.. శుక్రవారమే కేబినెట్ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మూకుమ్మడిగా ఆమోదం తెలిపినట్లు సమాచారం.