కేంద్ర మంత్రివర్గాన్ని త్వరలోనే విస్తరించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలకు నెలరోజుల ముందే ప్రధాని నరేంద్ర మోడీ మంత్రివర్గం విస్తరణ గురించి ఊహాగానాలు వినిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు తెలిపాయి.
కేంద్ర కేబినెట్ ఇవాళ కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం శ్రీ పేరుతో మోడల్ స్కూళ్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 14వేల పీఎం శ్రీస్కూల్స్ ఏర్పాటు చేయాలని.. తద్వారా 18 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణను మరింత వేగం చేయాలని కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రోజు సమావేశం అయిన కేంద్ర క్యాబినెట్ మహారత్న,నవరత్న, మినీరత్న ప్రభుత్వ రంగ సంస్థలలో మరింత వేగంగా పెట్టుబడుల ఉపసంహరణకు నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో పాటు మైనారిటీ భాగస్వామ్యాలను అమ్మాలని నిర్ణయం తీసుకుంది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా నిర్ణయ అధికారాన్ని ప్రభుత్వ రంగ సంస్థల డైరెక్టర్లకు కట్టుబెడుతూ కీలక నిర్ణయాన్ని తీసుకుంది.…
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని… గత శుక్రవారం పీఎం నరేంద్ర మోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే… ఈ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకునే ప్రక్రియకు తాజాగా కేంద్ర కేబినెట్ ఆమోద ముంద్ర వేసింది. వివాదాస్పద 3 వ్యవసాయ చట్టాలను వెనక్కుతీసుకునే ప్రక్రియను పూర్తిచేసిన కేంద్రం… రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉపసంహరణకు సర్వం సిద్ధమైంది. అలాగే…. మరో 4 నెలల పాటు ఉచిత…
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కుప్పకూలిన, ఆర్ధిక మోసాలకు గురైన బ్యాంకు డిపాజిటర్లకు ఉపశమనం కలిగించే నిర్ణయాలు తీసుకున్నది. డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ చట్టంలో సవరణలను క్లియర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిపాజిటర్లకు వారి మొత్తం డిపాజిట్లపై రూ. 5 లక్షల భీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభావిత బ్యాంక్ తాత్కాలిక నిషేదానికి గురైన 90 రోజుల్లో ఈ భీమా లభిస్తుంది. దివాలా తీసిన బ్యాంకులపై ఆర్బీఐ తాత్కాలిక నిషేదం విధించిన తరువాత…