Central Cabinet Meeting: నేడు కేంద్ర మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఇవాళ (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. అలాగే, జమిలీ ఎన్నికలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక దసరా, దీపావళి పండగలు వస్తున్న నేపథ్యంలోనే.. ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశం ఉంది.
Read Also: Stop Smoking Cigarettes: సిగరెట్ వ్యసనాన్ని ఆపేద్దామని భావిస్తున్నారా? ఇలా ట్రై చేయండి
అలాగే, హర్యానాలో హ్యాట్రిక్ విజయం తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం భారత ప్రజాస్వామ్య విజయం అని పేర్కొన్నారు. హర్యానా రైతులు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నామని నిరూపించారు.. హర్యానాలో కమలం మూడో సారి కూడా వికసించిందన్నారు. ఇక, జమ్మూ కాశ్మీర్ ఎన్సీ- కాంగ్రెస్ కూటమికి ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది.. బీజేపీకి మాత్రం గతం కంటే అధికంగా ఓట్లు లభించాయని ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు.