Waqf board: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు మార్పులు తేవడానికి కొత్తగా బిల్లు తీసుకురావాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మసీదులు, ఇస్లాంలో సంబంధం ఉన్న ఆస్తుల్ని నిర్వహించే వక్ఫ్ బోర్డుల ‘‘అపరిమిత అధికారాలను’’ అరికట్టడానికి కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. వక్ఫ్ బోర్డులను సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లును తీసుకురాబోతున్నట్లు సమచారం. రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డుల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా సవరణలు చేస్తున్నట్లు ప్రభుత్వం వర్గాలు ఆదివారం తెలిపాయి. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు, కౌన్సిల్‌లో మహిళలు సభ్యులు కాదు. కొత్తగా తీసుకురాబోతున్న చట్టంలో మొత్తం 40 సవరణలకి కేంద్ర మంత్రివర్గం శుక్రవారం ఆమోదం తెలిపిందని తెలుస్తోంది.
Read Also: Love Jihad: “లవ్ జిహాద్”కి పాల్పడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం తెస్తామన్న హిమంత..
ఆస్తులపై వక్ఫ్ బోర్డు అపరిమిత అధికారాలను అరికట్టేందుకు కేంద్రం బిల్లును తీసుకువస్తోందనే వార్తలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తిని హరించేందుకు మోడీ యత్నిస్తున్నారని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులకు మొదటి నుంచి బీజేపీ వ్యతిరేకంగా ఉందని, వారికి హిందుత్వ ఎజెండా ఉందని అన్నారు. వక్ఫ్ బోర్డు స్వయంప్రతిపత్తి కోల్పోతే దానిపై ప్రభుత్వం నియంత్రణ పెరుగుతుందని అన్నారు. 60 నుంచి 70 శాతం వక్ఫ్ ఆస్తులు మసీదులు, దర్గాలు, శ్మశాన వాటికల రూపంలో ఉన్నాయని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు(ఏఐఎంపీఎల్‌బీ) సభ్యుడు మౌలానా ఖలీల్ రషీద్ ఫరంగి మహలీ అన్నారు.