Census: దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కింపు’’పై కేంద్రం చర్యల్ని వేగవంతం చేసింది. తొలి దశలో దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లను లెక్కించి, జాబితా చేయనున్నారు. ఈ గృహాల గణన ఏప్రిల్ 1, 2026 నుంచి ప్రారంభమవుతుందని, ఇది జనాభా లెక్కింపు మొదటి దశ ప్రారంభాన్ని సూచిస్తుందని భారత రిజిస్ట్రార్ జనరల్ తెలిపారు.
Delimitation: ప్రస్తుతం ‘‘డీలిమిటేషన్’’ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలను భయపెడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఎంపీ సీట్లు తగ్గుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన ‘‘జనాభా నియంత్రణ’’ పద్ధతులు పాటించడం ద్వారా పార్లమెంట్ స్థానాలు తగ్గే అవకాశం ఉందని స్టాలిన్ చెబుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో, దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ఆ ప్రాంతంలో ఎంపీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. కేబినెట్ విస్తరణ, పలు కీలక అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించారు. భేటీ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు.
CRS Application : కేంద్ర హోంమంత్రి అమిత్ షా సెన్సస్ బిల్డింగ్‌లో సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్‌ఎస్) యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచైనా జనన మరణాలను నమోదు చేసుకోవచ్చు.
Census: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ‘‘జనాభా లెక్కల’’ సేకరణకు సిద్ధమైంది. 2025లో దేశ జనాభాపై అధికారిక సర్వే అయిన జనగణను ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుంది మరియు 2026 వరకు కొనసాగుతుందని సంబంధిత వర్గాలు సోమవారం తెలిపాయి. ‘కులగణన’ కోసం ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే, జనాభా గణనకు సంబంధించి వివరాలను ఇంకా బహిరంగపరచలేదు.
నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఆలస్యం తర్వాత 2025లో దేశ జనాభాకు సంబంధించిన అధికారిక సర్వే అయిన జనాభా గణనను ప్రభుత్వం ప్రారంభించనుందని సోమవారం ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ 2025లో ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు. జనాభా లెక్కల అనంతరం లోక్‌సభ స్థానాల విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2028 నాటికి ఈ కసరత్తు పూర్తయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Indian Census: దేశంలోని లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే 'నారీ శక్తి వందన్ చట్టం' బిల్లు ఆమోదం పొందిన తర్వాత భారత జనాభా లెక్కలపై చర్చ మొదలైంది.