Cement Rates: గత కొంత కాలంగా సిమెంట్ రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడి ఇల్లు కట్టుకునే కలను కలగానే మిగులుస్తున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం సిమెంట్ ధరలు దిగి వస్తాయిని ప్రముఖ రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది. గత నాలుగేళ్లలో 4 శాతం వార్షికి వృద్ధి రేటుతో సిమెంట్ ధరలు పెరిగాయి. తాజా పరిణామాల వల్ల కొంత తగ్గుతాయని అంచాన వేస్తోంది.
సామాన్యులకు సొంతింటి కల మరింత ప్రియం కానుంది. తాజాగా ఏపీ, తెలంగాణలో మరోసారి సిమెంట్ ధరలు పెరిగాయి. ఈనెల 1 నుంచి సిమెంట్ బస్తాపై రూ. 20 నుంచి రూ. 50 వరకు ధర పెంచినట్లు సిమెంట్ కంపెనీలు వెల్లడించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 50 కిలోల బస్తా ధర బ్రాండ్ ఆధారంగా రూ.310 నుంచి రూ.400 వరకు పలుకుతోంది. సిమెంట్ ధరలు భారీగా పెరుగుతున్న కారణంగా ఇల్లు కట్టుకోవాలంటే పలువురు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.…
ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20-30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300-350 మధ్యలో ఉంటుందని తెలిపారు. Read Also: కరోనాకు టాబ్లెట్ వచ్చేసింది… ధర ఎంతో తెలుసా? గత…
సొంతిల్లు కట్టుకోవాలనుకునే వారికి సిమెంట్ కంపెనీలు ఊరట కలిగించే వార్తను అందించాయి. 50 కిలోల బస్తాపై రూ.20 నుంచి రూ.40 వరకు తగ్గిస్తున్నట్లు సిమెంట్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో ఏపీ, తెలంగాణలో 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ.40 తగ్గింది. తమిళనాడులో రూ.20 తగ్గగా… కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో బస్తా ధర రూ.30 వరకు తగ్గినట్లు తెలుస్తోంది. తాజా ధరల ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సిమెంట్ బస్తా బ్రాండ్‌ను బట్టి రూ.280 నుంచి రూ.320కి లభించనుంది.…