Telangana Janasena: తెలంగాణ జనసేన కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడే ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం అవుతుందని తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స సంబరాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు.
తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించడానికి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లను చేస్తోంది. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పిస్తారు. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
Tummala Nageswara Rao: నీతి వంతమైన రాజకీయలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమయి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఈసీ ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో.. అందుకు తగిన విధంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉన్నతాధికారులతో సమావేశమై సమీక్షించారు.
చాలామంది జీవనం కొనసాగించడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే చాలామందికి వారు చేసే ఉద్యోగం నచ్చకున్నా అలానే కుటుంబ బాధ్యతలు కోసం, ఆర్థిక అవసరాల కోసం చేస్తూనే ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగంలో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే ఉద్యోగం చేసేవారిలో.. ఏ చిన్న అవకాశం దొరికినా కానీ.. వారికి నచ్చిన పనిని ప్రశాంతంగా చేసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి నచ్చని పనిని ఎక్కువ రోజులు చేసే కంటే నచ్చిన పనిని తక్కువ రోజులు చేసిన సంతృప్తిని…
తల్లిదండ్రులు పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని.. అప్పుడే వారు ఉన్నత స్థాయికి వెళ్తారని స్త్రీ శిశు సంక్షేమ , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శిశు సంక్షేమ, సీనియర్ సిటిజన్స్ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రి సీతక్కతో పాటు మహిళ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ పాటు పలువురు మహిళ అధికారిణిలు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకి భారత రత్న అవార్డు ఇవ్వడం పట్ల పీవీ స్వగ్రామం వంగర గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. పీవీకి అత్యున్నత పౌర పురస్కారం దక్కడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. భారత దేశానికి ఆర్థిక సంస్కరణలు తెచ్చి అభివృద్ధికి తోడ్పడిన పీవీని గౌరవించడం సంతోషకరం అని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా.. పీవీ పేరుతో జిల్లాను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. అంతేకాకుండా.. బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు పేరుతో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని…
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో జరిగిన దళాల పరేడ్ ఆకట్టుకుంది. అనంతరం ఆయా రాష్ట్రాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన వీక్షకులను అబ్బురపరిచింది. ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శకటాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చప్పట్లు కొట్టి ప్రశంసించారు.
విశాఖలో బీజేపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో రేపు ఘనతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు(శుక్రవారం) ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ రోడ్డులో రిప్లబిక్ ఫ్రీడమ్ కలర్ వాక్ నిర్వహిస్తున్నామని తెలిపారు. నాలుగు వందల మీటర్లు పొడువైన జాతీయ జెండాతో వాక్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు పిల్లలకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. అలాగే.. సాయంత్రం టాలీవుడ్ సింగర్ అరుణ్ కౌండిన్య,…