చాలామంది జీవనం కొనసాగించడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే చాలామందికి వారు చేసే ఉద్యోగం నచ్చకున్నా అలానే కుటుంబ బాధ్యతలు కోసం, ఆర్థిక అవసరాల కోసం చేస్తూనే ఉంటారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్యోగంలో కష్టపడుతూ జీవనాన్ని కొనసాగిస్తారు. అయితే ఉద్యోగం చేసేవారిలో.. ఏ చిన్న అవకాశం దొరికినా కానీ.. వారికి నచ్చిన పనిని ప్రశాంతంగా చేసుకోవాలని భావిస్తుంటారు. నిజానికి నచ్చని పనిని ఎక్కువ రోజులు చేసే కంటే నచ్చిన పనిని తక్కువ రోజులు చేసిన సంతృప్తిని పొందవచ్చు. ఇక అసలు విషయంలోకి వెళ్తే..
Also read: NOTA: ఒక వేళ “నోటా”కు ఎక్కువ ఓట్లు వస్తే ఎలా..? ఈసీకి సుప్రీం నోటీసులు..
తాను చేసే పని నచ్చకపోవడంతో తాజాగా ఓ ఉద్యోగి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూణే నగరానికి చెందిన వ్యక్తి ఓ సంస్థలో సేల్స్ అసోసియేట్ గా పనిచేస్తున్నాడు. కాకపోతే అతనికి గత కొన్ని రోజులుగా అతను చేసే ఉద్యోగం పట్ల అసహనంతో ఉన్నాడు. కంపెనీలో ఎలాంటి ఇంక్రిమెంట్స్, అలాగే కెరియర్ గ్రోత్ లేకపోవడంతో అతను డీలా పడిపోయాడు. ముఖ్యంగా కంపెనీలో ఉండే వర్క్ ప్రెజర్ తో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోయాడు. దాంతో మూడేళ్లగా పనిచేస్తున్న కంపెనీపై అతడు రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. దాంతో కంపెనీలో తన ఉద్యోగాన్ని మానేసి దానిని వేడుకల సెలబ్రేట్ చేసుకున్నాడు.
Also read: Lok Sabha Elections: నామినేషన్ వేసేందుకు కాళ్ల వేళ్ల పడ్డ అభ్యర్థి.. అనుమతించని అధికారులు
తన స్నేహితులతో కలిసి ఆఫీసు ముందు డప్పు చప్పుడులతో పండగ వాతావరణాన్ని సృష్టించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోకు సంబంధించి సదరు వ్యక్తి మీలో చాలామంది తన లాంటి అనుభవాన్ని ఎదుర్కొనే ఉంటారని అనుకుంటున్నట్లు తెలుపుతూ.. పని ప్రదేశంలో ఈ మధ్యకాలంలో గౌరవం లేకపోవడం సర్వసాధారణంగా మారిపోయిందని తన మనోభావాలను వ్యక్తపరిచాడు. ఇక ఈ వీడియోలో తన బాస్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే తన స్నేహితులతో కలిసి డాన్స్ వేస్తూ అతనికి కోపం తెప్పించేలా చేశాడు. ఇదంతా వీడియోలో స్పష్టంగా కనబడుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్.. బాస్ నువ్వు సరైన పని చేసావ్., కాకపోతే నీలా మాకి ధైర్యం చేసేంత స్థాయి లేదంటూ కామెంట్ చేస్తున్నారు.