సిద్దిపేటలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం రావణ దహన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సిద్దిపేట కల నెరవేరిందని అన్నారు. దసరా పండుగ లోపు సిద్దిపేటకి రైలు తెస్తాను అని గత దసరా రోజున చెప్పానన్నారు. ఈ దసరా లోపు సిద్దిపేటకి రైలు తెచ్చి దశాబ్దాల కల నిజం చేసుకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమిచ్చింది. కృష్ణానదిలో తెప్పోత్సవానికి సర్వం సిద్ధం చేశారు. మరికాసేపట్లో శ్రీ గంగా పార్వతి సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు కృష్ణానదిలో విహరించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవిని విమర్శించేంత సంస్కారహీనుడును తాను కానని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలని కొడాలి నాని చాలెంజ్ చేశారు.
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతట సంబరాలు అంబరానంటాయి. అంతేకాకండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తాము ఉన్న చోట స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఒక చోట మాత్రం చిరకాల ప్రత్యర్థులుగా భావించే భారత్, పాక్ పౌరులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ అరుదైన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో జరిగింది. భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందే అంటే…
ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నేటితో 60 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ వేడుకల్లో రాష్ట్ర రోడ్డు, భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని.. జలహారతి ఇచ్చారు.
ధోనీ చాలా కూల్‌గా పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు. రాంఛీలో తన నివాసంలో మూడు పెంపుడు కుక్కలతో కలిసి కేక్ కట్ చేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
బ్రిటీష్ పాలనలో ఎన్నో ఏళ్లు అణిచివేతకు గురై తిరగబడటంతో ఎట్టకేలకు అమెరికా 1776 జులై 4న స్వేచ్ఛావాయువులు పీల్చుకుంది. అప్పటి నుంచి ఏటా స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుతోంది.