Hyderabad: అంబరాన్నంటిన రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబురాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్స సంబరాలు అంబరాన్నంటాయి. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. గవర్నర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు, సీఎస్ శాంతి కుమారి, పలువురు మంత్రులు తదితరులు ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కళాకారులు వేడుకలకు వచ్చారు. వారు తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 కళలను ప్రదర్శించారు. ప్రత్యేక కార్యక్రమాలను వీక్షించేందుకు నగరవాసులు భారీగా తరలిరావడంతో ట్యాంక్‌బండ్ పరిసరాలు కిటకిటలాడాయి. వేడుకలు జరుగుతున్న సమయంలో వర్షం పడటంతో సాంస్కృతిక కార్యక్రమాలకు ఆటంకమేర్పడింది. వేడుకల్లో భాగంగా జయహే తెలంగాణ రాష్ట్ర గీతానికి ఐదు వేల మంది ట్రైనీ పోలీసులతో నిర్వహించిన ఫ్లాగ్ వాక్ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అందెశ్రీ, కీరవాణి, శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
READ MORE: Health tips: 40 ఏళ్ల తర్వాత కూడా యవ్వనంగా ఉండాలంటే ఇవి ట్రై చేయండి
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
కాగా.. ఉదయం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో రాష్ట్రీయ గీతం జయజయహే తెలంగాణ గేయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. జూన్ 2 ఆదివారం రోజు తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!