Tummala Nageswara Rao: నీతి వంతమైన రాజకీయలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో ఎమ్మెల్యే రాగమయి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. దేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. యే నాయకులకు దక్కని ఘనత ఎన్టీఆర్ కే దక్కిందన్నారు. నీతి వంతమైన రాజకీయలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఓట్ల కోసం ఆయన పధకాలను చూపిస్తూ ఇతర పార్టీ లు వారు అధికారం కోసం అవసరల కోసం ఎన్టీఆర్ భజన చేస్తున్నారని అన్నారు. సంక్షేమం అంటే ఎన్టీఆర్ ని అవే ఇప్పటికి కొనసాగుతున్నాయని గుర్తు చేశారు.
Read also: Children Sales: హైదరాబాద్ లో పిల్లల అమ్మకాల ముఠా గుట్టురట్టు..
నీతి నిబద్దత ఉంటే యే నాయకుడిని అయిన ప్రజలు బ్రహ్మరధం పడతారన్నారు. ఎన్నికల కోడ్ అయిన తరువాత గ్రీన్ ఫీల్డ్ ఎగ్జిట్ విషయం పూర్తి చేస్తానని తెలిపారు. సీతరామ ప్రాజెక్టు పూర్తి చేసి వేంసూరు మండలానికి గోదావరి జలాలు అందిస్తామన్నారు. ఎన్టీఆర్ ఆస్సీసులతో ముందుకు వెళ్తా అన్నారు. యే నాయకుడు అయిన సరే గౌరవం కోరుకుంటుందన్నారు. నాయకుల కార్యకర్తల గౌరవం తగ్గించే పని చేస్తే పదవులు దూరం అవుతాయన్నారు. నీతికి నిజాయితిగా పని చేయ్యాలని ఎమ్మెల్యే రాగమయిని కోరారన్నారు. బురద జల్లాలని చూస్తూంటారు కొంత మంది అలాంటి వాటిని తట్టుకొని నియోజకవర్గ అభివృద్ధి పధంగా నడపాలన్నారు.
Ayodhya: అయోధ్య శ్రీ రామయ్యకు దుబ్బాక చేనేత వస్త్రం..