Telangana Janasena: తెలంగాణ జనసేన కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. ఆంద్రప్రదేశ్ లో ఏర్పడే ప్రభుత్వంలో జనసేన పార్టీ భాగస్వామ్యం అవుతుందని తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు. ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కు కీలక పదవి ఇవ్వాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పదవిని పవన్ కళ్యాణ్ కు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కూటమి గెలుపులో పవన్ కళ్యాణ్ పాత్ర కీలకంగా ఉందన్నారు. కాగా.. ఆంధ్రా ఓటర్లు హలో ఏపీ బై వైసీపీ అంటూ తీర్పు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మహాకూటమి భారీ ఆధిక్యత దిశగా సాగుతుండగా.. కూటమి ప్రభంజనంలో ఫ్యాన్ కొట్టుకుపోయింది. ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ దాటిన మహాకూటమి జిల్లాలను క్లీన్ స్వీప్ చేస్తోంది. తూర్పుగోదావరి, కృష్ణా, విజయనగరం, చిత్తూరు జిల్లాలను కూటమి క్లీన్ స్వీప్ చేసింది.
Read also: Malkajgiri Lok Sabha Result 2024: మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో ఈటల ముందంజ
వైసీపీ అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు. చంద్రబాబు, పవన్, బాలకృష్ణ, లోకేష్ సక్సెస్ దిశగా దూసుకుపోతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో కూటమి దూసుకుపోతోంది. రాయలసీమలోనూ పొత్తుల జోరు కొనసాగుతోంది. కడప మినహా అన్ని జిల్లాల్లోనూ కూటమి హవా ఉంది. రాజధాని పరిసర ప్రాంతాల్లో కూటమి ముందడుగు వేస్తోంది. ఉమ్మడి గోదావరి, దక్షిణ కోస్తాలో కూడా సైకిల్ పరుగులు తీస్తున్నారు. ఒకరిద్దరు తప్ప మంత్రులు ఓటమి బాట పట్టారు. పెద్దిరెడ్డి, రోజా, బుగ్గన, కొడాలి నాని అంబటి, గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వెనుకంజలో ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తోందన్నారు.
Manamey : గ్రాండ్ గా శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా రానున్న ఆ స్టార్ హీరో..?