కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో చాలా విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మధ్యలో చిక్కుకున్న పిల్లిని కాపాడే ప్రయత్నంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని 44 ఏళ్ల సిజోగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిజో మంగళవారం రాత్రి తన కుక్కలకు మాంసం స్క్రాప్‌లు కొని ఇంటికి తిరిగి వస్తున్నాడు. రోడ్డు మధ్యలో పిల్లి పిల్లను చూసిన వెంటనే, ఏమీ ఆలోచించకుండా బైక్ దిగి దానిని కాపాడటానికి పరిగెత్తాడు. కానీ అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది.
READ MORE: Kalyanram : ‘ముచ్చటగా బంధాలే’.. కల్యాణ్ రామ్, విజయశాంతి మధ్య సాంగ్ వచ్చేసింది..
ప్రమాదం జరిగిన కొన్ని సెకన్ల తర్వాత, ముందు నుంచి వస్తున్న కారు కూడా అతన్ని ఢీకొట్టింది. ఇది గమనించిన గాయపడిన సిజోను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అతను మార్గమధ్యలో ప్రాణాలు వదిలాడు. ఈ విషాద సంఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లారీ డ్రైవర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 106 (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం), 281 (నిర్లక్ష్యంగా వాహనం నడపడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మన్నుతి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సిజో చాలా దయగల వ్యక్తి అని, జంతువుల పట్ల అతనికి ప్రత్యేక ప్రేమ ఉండేదని స్థానిక ప్రజలు చెబుతారు. ఆయన మరణం ఆ ప్రాంతమంతా శోకసంద్రాన్ని సృష్టించింది.
READ MORE: GT vs RR: పాయింట్స్ టేబుల్ టాపర్గా గుజరాత్ టైటాన్స్ నిలుస్తుందా? మొదట బౌలింగ్ చేయనున్న ఆర్ఆర్
Tragic End for 42-Year-Old Man Hit by Truck While Saving Cat in Kerala pic.twitter.com/KpLixsdYXX
— Indian News Network (@INNChannelNews) April 9, 2025