Viral Video: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోండా జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అమర్‌కిషోర్ బామ్ బామ్ ఒక మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 9:30 గంటల సమయంలో మహిళతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన, ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకుని అనంతరం గదిలోకి తీసుకెళ్లిన దృశ్యాలు పార్టీ కార్యాలయంలోని సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద దుమారం రేగింది.
Read Also: Himanta Biswa Sarma: ‘చికెన్ నెక్’ వివాదంపై బంగ్లాదేశ్‌కు హెచ్చరిక చేసిన అస్సాం సీఎం..!
వీడియోపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో బీజేపీ నేత బామ్ బామ్ స్పందించారు. వీడియోలో ఉన్నది తానేనని అంగీకరించిన ఆయన, ఆ రోజు ఆ మహిళా కార్యకర్త అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవడంతో విశ్రాంతి తీసుకోవాలని మాత్రమే ఆఫీసుకు తీసుకెళ్లానని వివరణ ఇచ్చారు. మానవతా దృక్పథంతో సహాయం చేశానని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంలో కుట్ర ఉందంటూ ఆరోపించారు. తనను పార్టీ జిల్లా అధ్యక్ష పదవి నుంచి తొలగించాలనే కుట్రతో కొంతమంది ఇలాంటి వీడియోలు లీక్ చేస్తున్నారని బామ్ బామ్ ఆరోపించారు.
Read Also: Karnataka: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత.. స్పీకర్ ఉత్తర్వులు..!
ఇక రెండు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో మరో బీజేపీ నేత మహిళతో నడిరోడ్డుపై అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో బయటకు రావడం గమనార్హం. వరుసగా బీజేపీ నేతలపై ఇలాంటి ఆరోపణలు రావడం పార్టీ ప్రతిష్ఠపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పార్టీ అధిష్ఠానం ఈ ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తక్షణమే విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీసే ప్రయత్నం చేయాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియోలు వైరల్ కావడం, మహిళల పట్ల ఉన్న గౌరవాన్ని ఉల్లంఘించే వాస్తవాలు బయటపడటం రాజకీయం లోని నియమ నిబంధనల పట్ల ఉన్న బాధ్యతను ప్రశ్నిస్తున్నాయి.
रात के 9.39 बजे हैं। Video उत्तर प्रदेश में गोंडा जिले के BJP दफ्तर की है। जिलाध्यक्ष अमर किशोर एक महिला को लेकर आते हैं। आलिंगन जिलाध्यक्ष जी CPR देते भी दिखते हैं, फिर एक फ्लोर ऊपर चले जाते हैं। वहां की फुटेज अभी प्राप्त नहीं हुई है।
जिलाध्यक्ष का बयान– "महिला कार्यकर्ता की… pic.twitter.com/vqRMTV14v3
— Sachin Gupta (@SachinGuptaUP) May 25, 2025