హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ కిస్మత్‌పూర్‌లో ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం రేపిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యువతి మర్డర్ మిస్టరీ కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఏలాంటి క్లూస్ లభించలేదని పోలీసులు తెలిపారు. యువతిని రేప్ చేసి ఆ పై హత్య చేసి దిగంబరిగా పడేశారు దుండగులు. పూర్తిగా కుళ్లిన స్థితిలో మృతదేహం గుర్తించారు. యువతి వివరాలు సేకరించే పనిలో పడ్డారు రాజేంద్రనగర్ పోలీసులు.
Also Read:Fraud: చిట్టీలు వేస్తున్నారా? జాగ్రత్త.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ. 5 కోట్లతో పరార్..
యువతి ఎవరూ అనే విషయాన్ని కూపి లాగుతున్నారు. స్థానికంగా ఉన్న అన్ని సీసీ టీవీ ఫూటేజ్ లను పరిశీలిస్తున్నారు. యువతి కదలికలు ఎక్కడా కనిపించడం లేదని తెలిపారు. కిస్మత్ పూర్ బ్రిడ్జ్ వద్ద కు యువతిని ఎవరు తీసుకొని వచ్చారు అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు పోలీసులు. మూడు ప్రత్యేక బృందాలతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.