వేగంగా వస్తున్న రైలు ఢీకొని యువకుడు మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా జిల్లా దాద్రి రైల్వే క్రాసింగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రైల్వే క్రాసింగ్‌లో యువకుడి బైక్ ఇరుక్కుపోయి, దానిని తీయడానికి ప్రయత్నిస్తుండగా ప్రమాదం జరిగింది. దీంతో వేగంగా వస్తున్న రైలు అతన్ని ఢీకొట్టింది.
Read Also:ముసలోడికి దసరా పండగే.. లేట్ వయసులో తండ్రి కాబోతున్న వృద్ధుడు
ఓ యువకుడు బైక్ పై ట్రాక్ ను దాటుతూ.. ప్రమాదవశాత్తు పడిపోయాడు. ట్రైన్ వచ్చేస్తుందన్న కంగారులో అతను పైకి లేచి.. తన బైక్ ను తీసుకుని వెళ్లేలోగానే దారుణ ఘటన జరిగింది. ట్రైన్ ఢీ కొని యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. బైక్ ను ఎలాగైనా కాపాడుకోవాలన్న ఆలోచనే అతని ప్రాణం తీసింది. దానిని అక్కడే వదిలేసి.. పక్కకు వెళ్లి ఉంటే యువకుడు ప్రాణాలతో ఉండేవాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడా జిల్లాలో జరిగింది.
Read Also:Three-Wife Wedding: ఉత్తమ భార్యలంటే మీరే తల్లి.. మొగుడికి దగ్గరుండి మూడో పెళ్లి
వీడియోలో, బైక్ పై ఉన్న వ్యక్తి రైలు పట్టాలను దాటడానికి ప్రయత్నిస్తాడు, కానీ దురదృష్టవశాత్తు అతని బైక్ ఇరుక్కుపోతుంది. అతను పక్కకు తప్పుకుని, వేగంగా వస్తున్న రైలు వెనుక నుండి వస్తోందని తెలియక బైక్ ను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. మరుక్షణంలో అతన్ని రైలు ఢీకొట్టింది. ఈ సంఘటన అందరినీ షాక్ కు గురిచేసింది.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు బయటికి రాగా.. అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. యువకుడు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పరుగు తీసినా ఫలితం దక్కలేదు. నిజానికి రైల్వే ట్రాక్స్ దాటే ప్రాంతాల్లో రైల్వే గేట్లు ఉండాలి. కానీ ఫుటేజీలో అక్కడ రైల్వే గేట్ ఉన్నట్లు కనిపించలేదు. ప్రమాదంలో యువకుడు మరణించడానికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు. కాగా.. యువకుడికి వచ్చే నెలలో పెళ్లి జరగాల్సి ఉండగా.. అంతలోనే దారుణం జరిగిపోయిందంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
#ग्रेटर_नोएडा
बोडाकी रेलवे लाइन पार करते वक़्त बाइक अनियंत्रित होकर गिरी. युवक ने बाइक उठाने का प्रयास किया.. पीछे से आ रही तेज रफ्तार ट्रेन की चपेट में आने से युवक की मौत हो गई. 22 नवंबर को होनी थी युवक की शादी.. pic.twitter.com/0gi6Fddn1T— Pravendra Singh Sikarwar (@Pravendra_Sikar) October 13, 2025