Zepto: హైదరాబాద్ నగరంలోని చిక్కడపల్లిలో జెప్టో (Zepto) డెలివరీ బాయ్స్ వీరంగం సృష్టించారు. ఒక కస్టమర్‌పై మూకుమ్మడి దాడికి పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి బాధితుడు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ACB Raids: కుప్పలు.. కుప్పలుగా నోట్ల కట్టలు.. భారీగా అక్రమాస్తులు గుర్తింపు!
చిక్కడపల్లిలోని అంబేద్కర్ బస్తీకి చెందిన సందీప్ అనే కస్టమర్ జెప్టోలో పెన్సిల్ కిట్, పెరుగు ప్యాకెట్‌ను ప్రీపెయిడ్ ఆర్డర్ చేశాడు. డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత, ఆర్డర్ చేసిన వస్తువుల్లో ఒకటి లేదని సందీప్ గుర్తించాడు. దీనిపై డెలివరీ బాయ్‌ను ప్రశ్నించగా.. వీఎస్‌టీ ఎస్పీ గార్డెన్స్ వద్ద ఉన్న జెప్టో హబ్‌కు వచ్చి మాట్లాడమని సూచించారు. సందీప్ జెప్టో హబ్‌కు వెళ్ళగా.. అక్కడ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వకపోగా, అతనిపై దాడికి పాల్పడ్డారు. వెంకట్, రాజు అనే డెలివరీ బాయ్స్‌తో పాటు మరికొందరు కలిసి గంజాయి మత్తులో ఈ దాడికి పాల్పడ్డారని బాధితుడు సందీప్ ఆరోపించారు. ఈ దాడి దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
Himachal Pradesh : హిమాచల్ మండిలో మేఘతుఫానుకి కొట్టుకుపోయిన బస్సులు, మట్టితో ముంచేసిన ఇల్లులు.
ఈ ఘటనపై సందీప్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డెలివరీ బాయ్స్ గంజాయి మత్తులో ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.