Kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ అత్యాచారం, హత్య కేసులో సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సెమినార్ హాలులో 31 ఏళ్ల ట్రైనీ వైద్యురాలి మృతదేహం కనుగొన్న తర్వాత, ఘటన గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో జాప్యం చేసినట్లు సీబీఐ కనుగొంది.
Kolakata Murder Case : కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై అత్యాచారం-హత్య కేసులో విధులు నిలిపివేసి రాష్ట్రంలోని జూనియర్ డాక్టర్లు గత 20 రోజులుగా సమ్మె చేస్తున్నారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. మూడు వారాలు అవుతున్న న్యాయం కోసం డాక్టర్లు, నర్సులు, మహిళా సంఘాలు, రాజకీయ పార్టీలు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఇక ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
సీఎం మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌లకు సీబీఐ పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించాలని డిమాండ్ చేసింది. బాధితురాలు ఆత్మహత్య చేసుకుందని పోలీసు కమిషనర్ మొదట చెప్పారని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది.
కోల్‌కతా అత్యాచారం, హత్య కేసులో పెద్ద విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత వైద్యురాలు ఆగస్టు 9 తెల్లవారుజామున 2:45 వరకు జీవించి ఉన్నట్లు సమాచారం. ఏజెన్సీల వద్ద అందుబాటులో ఉన్న సాంకేతిక ఆధారాల ద్వారా ఇది ధృవీకరించబడింది.
Polygraph Test: కోల్‌కతాలో ఆర్జీ కార్ హస్పటల్ జూనియర్ డాక్టర్ ని హత్యాచారం చేసిన కేసులో.. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్కి ఆదివారం పాలీగ్రాఫ్ టెస్ట్ చేశారు. కోల్‌కతా పోలీసు శాఖలో సివిల్ వాలంటీర్గా అతను వర్క్ చేస్తున్నాడు. అయితే, సీబీఐకి ఇచ్చిన లై డిటెక్టర్ పరీక్షలో నిందితుడు సంజయ్ కొన్ని కీలక అంశాలు వెల్లడించినట్లు తెలుస్తుంది.
పశ్చిమబెంగాల్ రాజధాని కోలకత్తాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం, హత్య కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు.