Kolkata Doctor Rape : కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో బుధవారం అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. అదుపు చేయలేనంత మంది ఒక్కసారిగా ప్రవేశించి ఆసుపత్రిలో విధ్వంసం సృష్టించారు.
Aravind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కి సోమవారం సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఆయన బెయిల్ పిటిషన్ను పరిశీలించేందుకు కోర్టు నిరాకరించింది.
కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనను మంగళవారం హైకోర్టు సీబీఐకి అప్పగించింది. దీంతో దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. హత్యాచార ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఇదిలా ఉంటే బుధవారం ఢిల్లీ నుంచి కోల్కతాకు ప్రత్యేక వైద్య మరియు ఫోరెన్సిక్ బృందం రానుంది. ఉదయాన్నే బయల్దేరి కోల్కతా చేరుకోనుంది. తొలుత ఆర్జీ కర్ ఆస్పత్రిని సందర్శించి దర్యాప్తు చేపట్టనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే.సక్సేనాకు రాసిన లేఖ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారాన్ని తీహార్ జైలు అధికారులు తీవ్రంగా పరిగణించారు. జైలు నిబంంధనలు ఉల్లంఘించడమేనని అధికారులు హెచ్చరిస్తున్నారు.
కోల్కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు మిన్నంటాయి. ఈ క్రమంలో.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం (ఆగస్టు 18) వరకు ఈ విషయాన్ని ఛేదించాలని పోలీసులకు తెలిపారు.
బ్యాంకు మోసం కేసులో 20 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఆదివారం పట్టుకుంది. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపర్చగా.. ఆగస్టు 16 వరకు రిమాండ్కు పంపారు. నిందితుడు చనిపోయినట్లు కొన్నేళ్ల క్రితం ఇక్కడి కోర్టు ప్రకటించింది.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటేచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకోవడంతో చర్చకు దారితీసింది.
Kejriwal: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించింది.