MLC Kavitha: ఇవాళ జైలు నుంచి కవిత విడుదల..
- ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది..
- ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 166 రోజులు తిహార్ జైలులో ఉన్న కవిత..
- రూ.10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం కోరింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ, ఈడీ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. పలు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. ఇవాళ ఎట్టకేలకు సాయంత్రం 5 గంటల లోపు కవిత విడుదల కానున్నారు. రూ.10 లక్షల విలువైన 2 షూరిటీలు సమర్పించాలని సుప్రీం ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దని తెలిపింది. కవిత పాస్‌పోస్ట్ ను అప్పగించాలని సుప్రీంకోర్టు తెలిపింది. కవిత బెయిల్ కు 3 ప్రధాన కారణాలు సుప్రీం కోర్టు తెలిపింది. మహిళకు ఉండే హక్కులను కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. నిందితురాలని జైలులో ఉంచాల్సిన అవసరం లేదని తెలిపింది. సీబీఐ తుది ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని, ఈడీ ఛార్జ్ షీట్ వేయలేదని తెలిపింది. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో 166 రోజులు కవిత తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.
Read also: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్..
Also Read
- TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
- CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
- Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
- Erravalli lands : ఎర్రవల్లి భూముల లెక్క తేల్చండి.. అధికారులకు రేవంత్ డెడ్‌లైన్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి.. తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కవిత బెయిల్ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. మార్చి 15 న ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అంతకు ముందు.. పది రోజుల ముందు ఈడి నోటీసులు ఇచ్చింది. దీని విచారణకు కవిత హాజరు కాలేదు.. 2022 జులై లో లిక్కర్ స్కామ్ వెలుగు లోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు 5 నెలల తర్వాత మొదటిసారిగా సీబీఐ కవితను విచారించింది. 2022 డిసెంబర్ 11న కవిత ఇంట్లోనే విచారించింది సీబీఐ. లిక్కర్ స్కామ్ లో సి ఆర్ పి సి 160 కింద 7 గంటల పాటు వాంగ్మూలం నమోదు చేసి చేసింది. 2023 మార్చ్ 11న మొట్టమొదటిసారిగా ఈ డి విచారణకు కవిత హాజరైంది. ఆ తర్వత 16, 20, 21 న ఢిల్లీలో కవితను ఈడీ విచారించింది. తన ఎనిమిది ఫోన్లని ఈడి కి కవిత సమర్పించింది. ఈడి, సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో కవిత పేరు ప్రస్తావన వచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ 50 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేసింది ఈడీ.
Read also: Patnam Mahender Reddy: నిబంధనల ప్రకారమే బిల్డింగ్ నిర్మించాం..
జనవరి 5న కవితకు మళ్ళీ ఈడి నోటీసులు ఇచ్చింది. మహిళను వ్యక్తిగతంగా విచారానికి పిలవడాన్ని సుప్రీంకోర్టు కవితలో సవాల్ చేసింది. ఢిల్లీ లిక్కర్స్ స్కామ్ లో ఫిబ్రవరి 21న కవితకు సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఫిబ్రవరి 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని నోటీసులో సీబీఐ పేర్కొంది. 41 సిఆర్పిసి నోటీసులు ఇచ్చింది. తొలిసారిగా నిందితురాలుగా చేర్చింది. సుప్రీం కోర్టులో కేసు విచారణ ఉంది…నేను రాలేను అని రిప్లై ఇచ్చింది. ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ ఉండగా అది ఈనెల 19 కి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబందించి సౌత్ గ్రూప్ కు కవిత నేతృత్వం వహించారనేది ప్రధాన ఆరోపణ కాగా.. ఇటీవల మాగుంట రాఘవ అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.. గతంలో ఇదే కేసులో దినేష్ ఆరోరా.. గోరుంట్ల బుచ్చిబాబు.. అరుణ్ రామచంద్ర పిళ్ళై.. అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే.
Tummala Nageswara Rao: రైతు రుణ మాఫీ పై యాప్ పని ప్రారంభించింది..
- Tags
- brs leader
- CBI
- ED
- Liquor Case
- MLC Kavita
తాజావార్తలు
-
UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
-
Chhattisgarh: కాంగ్రెస్ నేతల హత్యపై సంచలన తీర్పు.. 10 మంది మావోలకు మరణశిక్ష
-
YS Jagan: ‘రెడ్ బుక్ గవర్నెన్స్’ గ్లోబల్ అయ్యింది.. ఏపీ పోలీసులు, ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ ఫైర్
-
TGSRTC : బస్టాండ్ ఇక కేవలం బస్టాండ్ మాత్రమే కాదు.. మాల్‌ను తలపించేలా కొత్త లుక్
-
Saudi-Houthis: మక్కా చేరిన హౌతీల దాడులు.. చప్పుడు చేయని పాక్.. కారణమిదేనా?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!