Tspsc paper leak: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ వేగవంతం చేయాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు పురోగతిపై జూన్ 5లోగా నివేదిక ఇవ్వాలని సిట్‌ను ఆదేశించింది.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుపై తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 7న సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఎమ్మెల్యే ఎర కేసులో సీబీఐ దర్యాప్తును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను ఈ నెల 17న విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా ఈరోజు సీజేఐ ధర్మాసనం ముందు ఈ పిటిషన్‌ను ప్రస్తావించారు.ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టేటస్ కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో మెరిట్‌లు ఉంటే తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తిప్పికొడతామని…
పశ్చిమ బెంగాల్‌లో బీర్భూమ్ జిల్లా బోగ్‌టూయి గ్రామంలో జరిగిన సామూహిక సజీవదహనాల అంశం కీలక మలుపు తిరిగింది. బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినా… ఘటన తీవ్ర దృష్ట్యా రాష్ట్ర పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలేరని అభిప్రాయపడింది కోల్‌కతా హైకోర్టు. నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను సీబీఐకి అప్పగించింది. సామూహిక సజీవదహనాలపై సమగ్ర దర్యాప్తు చేసి… ఏప్రిల్ 7వ తేదీలోగా తమకు నివేదిక ఇవ్వాలని సీబీఐకి స్పష్టం చేసింది కోల్‌కతా హైకోర్టు. కేసుకు…
మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఢిల్లీ పెద్దలదే అన్నారు టీడీపీ నేత బోండా ఉమా. గతంలో జయలలిత కేసు కర్ణాటకలో విచారణ జరిగినట్లు వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి. వివేకా హత్య కేసు నిందితుల్ని కాపాడేందుకు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల్ని సైతం నాశనం చేసే తీరు చూసి దేశం మొత్తం నివ్వెరపోతోంది. బాబాయ్ హత్యకేసు వెలికితీస్తున్న సీబీఐ అధికారులపై పోలీసులతో కేసు…
అఖిల భారతీయ అఖారా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మృతి కేసులో రంగంలోకి దిగింది సీబీఐ.. నరేంద్ర గిరి అనుమానాస్పద మరణంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కాగా.. ఇక, యూపీ సర్కార్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీంతో.. రంగంలోకి దిగింది కేంద్ర దర్యాప్తు సంస్థ.. యూపీ పోలీసుల నుంచి కేసును సీబీఐ స్వాధీనం చేసుకుంది.. ఎఫ్ఐఆర్‌ను నమోదు చేసినట్టు అధికారులు తెలిపారు. కాగా,…
సంచలనంగా మారిన ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ హత్య కేసును సీబీఐకి అ్పపగించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని.. దర్యాప్తును వేగంగా పూర్తి చేసి, నిందితులకు శిక్షపడేలా చేస్తామన్నారు జార్ఖండ్ సీఎం. ఈ కేసును సుమోటోగా విచారించనున్నట్లు సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు. అయితే.. తనను యాక్సిడెంట్లో చంపేయాలని దుండగులు కుట్ర పన్నారని, త్రుటిలో తప్పించుకోగలిగానని ఫతేపూర్ జిల్లా అడిషనల్ జడ్జి అహ్మద్‌ఖాన్… పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఝార్ఖండ్ లోని ధన్ బాద్ లో…
వైయస్ వివేకా హత్య కేసులో 14వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణ జరుగుతుంది. వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి వరుసగా నాలుగో రోజు విచారణకు హాజరయ్యాడు. అయితే ఎర్ర గంగిరెడ్డితో పాటు రాఘవేంద్ర రెడ్డి, సింహాద్రిపురం నుంచి వ్యవసాయ కూలీ ఓబుల్ పతి నాయుడు, కదిరికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డి, పులివెందులకు చెందిన దంపతులు కృష్ణా, సావిత్రి తో కలిపి నేడు మొత్తం ఆరు మంది…
వైఎస్ వివేకా హత్య కేసులో పదో రోజు సిబిఐ విచారణ కొనసాగుతుంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో సీబీఐ విచారణ జరుగుతుంది. ఈరోజు తాజాగా ముగ్గురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు సిబిఐ అధికారులు. చిట్వేలి మండలానికి చెందిన వైకాపా కార్యకర్తలు లక్ష్మీ రంగా, రమణను ప్రశ్నిస్తున్న సిబిఐ అధికారులు… వారితో పాటు సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామానికి చెందిన జగదీశ్వర్‌రెడ్డిని ప్రశ్నించారు సీబీఐ అధికారులు. గతంలో వివేకా దగ్గర జగదీశ్వర్ రెడ్డి పీఏగా పనిచేసాడు. అయితే చూడాలి మరి…