MP K.Laxman : మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బీఆర్‌ఎస్ కూలింది
- 22 నెలల ఆలస్యం ఎందుకు?.. సీఎం రేవంత్‌పై లక్ష్మణ్ ప్రశ్నలు
- కాగ్, విజిలెన్స్ నివేదికల్లో స్పష్టమైన అవినీతి వివరాలు
- హరీష్, సంతోష్ అవినీతి ఆనకొండలు.. కవిత ఆరోపణలు
- అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది :బీజేపీ విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP K.Laxman : బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలుపుతూ కాళేశ్వరం అవినీతి కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొన్న కాళేశ్వరం కూలింది, నిన్న బిఆర్ఎస్ కూలింది. కాళేశ్వరం మూడు పిల్లర్లు కూలిపోతే, బిఆర్ఎస్ మూడు ముక్కలైంది” అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు కోరుతూ కేంద్రానికి లేఖ రాసిన విషయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి 22 నెలలు ఎందుకు ఆలస్యం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆధారాలు ఉన్నాయని చెప్పిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు ఆ ఆధారాలను సీబీఐకి సమర్పించి దర్యాప్తుకు సహకరించాలని లక్ష్మణ్ సూచించారు.
Delhi: ఢిల్లిలో అక్రమ ఆయుధాల కర్మాగారం.. పట్టుకున్న పోలీసులు..
Also Read
సీబీఐ విచారణలో ఎవరైనా ఉన్నా శిక్షించాల్సిందేనని స్పష్టం చేశారు. “కాగ్ నివేదిక, విజిలెన్స్ రిపోర్టులు అన్నీ అవినీతి స్పష్టంగా చూపిస్తున్నాయి. అయితే ఘోష్ కమిటీ రాజకీయ, అధికారుల, కాంట్రాక్టర్ల పాత్రను తేల్చలేకపోయింది. కవితే స్వయంగా హరీష్ రావు, సంతోష్ అవినీతికి పాల్పడ్డారని చెప్పింది. వారిని ‘ఆనకొండలు’గా సంబోధించింది. అలా అయితే కేసీఆర్ కూడా అవినీతిలో భాగస్వామే కాదా?” అని ప్రశ్నించారు. “రాష్ట్రం కోసం వేలాది మంది యువత, ఉద్యోగులు, ప్రజలు పోరాటం చేశారు. అమరుల త్యాగాలను కేసీఆర్ కుటుంబం క్యాష్ చేసుకుంది. తెలంగాణ ఆస్తులను బిఆర్ఎస్ కొల్లగొట్టింది. అవినీతి పరులకు బీజేపీలో స్థానం లేదు. కఠినంగా శిక్షించాలి” అని లక్ష్మణ్ అన్నారు.
పావురాల గుట్టలో ఆ రోజు నిజంగా ఏం జరిగింది..? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం నిజాలు
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!