Tamil Nadu: తమిళనాడును కుదిపోస్తున్న లాకప్ డెత్.. స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్
- తమిళనాడును కుదిపోస్తున్న లాకప్ డెత్
- స్టాలిన్ రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడులో జరిగిన లాకప్ డెత్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. పోలీస్ కస్టడీలో ఆలయ గార్డు అజిత్ కుమార్ మరణించిడంపై పొలిటికల్‌గా తీవ్ర దుమారం రేపుతోంది. డీఎంకే పాలనలో లాకప్ డెత్‌లకు రాష్ట్రం మాతృభూమిగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: Pashamilaram-Incident : రెండు నెలల కిందే పెళ్లి.. సిగాచి మృతుల్లో నవదంపతులు..
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
గత వారం మాదపురం కాళీఅమ్మన్ ఆలయానికి మహిళ కారులో వచ్చింది. అక్కడే పని చేస్తున్న ఆలయ గార్డు అజిత్ కుమార్‌కు తాళాలు ఇచ్చి పార్కు చేయమని చెప్పింది. అయితే అతడికి కారు నడపడం చేతకాకపోవడంతో మరొకరి సహాయం తీసుకున్నాడు. అయితే దర్శనం అనంతరం కారు తీసుకెళ్తుండగా కారులో 80 గ్రాముల బంగార ఆభరణాలు పోయాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో జూన్ 27న అజిత్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీస్ విచారణలో అజిత్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరు అయింది. పోలీసులు కొట్టడం వల్లే అజిత్ ప్రాణాలు పోయాయంటూ ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. డీఎంకే ప్రభుత్వంపై అన్నాడీఎంకే, బీజేపీ విమర్శలు గుప్పించింది. మృతికి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Telangana BJP : టీబీజేపీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు.. అధికారికంగా ప్రకటన
పోలీసుల వివరాల ప్రకారం.. అజిత్ కుమార్ దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసినట్లు వెల్లడించారు. అయితే ఆభరణాలు దాచి పెట్టిన చోటికి తీసుకెళ్లినప్పుడు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా మూర్ఛ వ్యాధితో మరణించినట్లు చెప్పుకొచ్చారు. విచారణలో అనేక పేర్లు చెప్పాడని.. చివరికి అతడే నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన రాజకీయంగా తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు కూడా విచారణ చేపట్టింది. అన్నాడీఎంకే నేతృత్వంలోని ప్రతిపక్షాలు న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. పోలీసు సిబ్బందిని అరెస్టు చేయాలని కోరాయి. అలాగే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. డీఎంకే పాలనలో 24 కస్టోడియల్ మరణాలు జరిగాయని తమిళనాడు బీజేపీ ఆరోపించింది. ఇక సోమవారం మద్రాస్ హైకోర్టు ఈ విషయాన్ని స్వయంగా విచారణకు స్వీకరించింది. అజిత్ ఏమైనా ఉగ్రవాదా? అని నిలదీసింది. అతనిపై ఎందుకు దాడి జరిగిందని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!