ఒక షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదు.. అంతేకాదు.. అతని ఫిర్యాదుపై అట్రాసిటీ కేసు చెల్లదు అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన మత స్వేచ్ఛ నివేదికను భారత్ నేరుగా తిరస్కరించింది. మత స్వేచ్ఛపై అమెరికా విదేశాంగ శాఖ నివేదికను తిరస్కరిస్తున్నామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.
ప్రధాని మోడీ ఓబీసీ కులంపై రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రం తోసిపుచ్చింది. రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఒడిషాలో కొనసాగుతోంది. ఈ యాత్రలో ప్రధాని మోడీ ఓబీసీ కాదంటూ రాహుల్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ ఓబీసీ కులంలో పుట్టలేదని.. ఆయన తన కులం గురించి అబద్ధాలు చెబుతున్నారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గురువారం భారత్ జోడో న్యాయ్ యాత్రలో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తన కులం గురించి అబద్ధాలు చెప్పారని ఆరోపించారు.
కొడుకు పెళ్లి కోసం ఓ తండ్రి తన కులం నుంచి మరొక కులానికి మారాడు. ఈఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నర్సింగపూర్ జిల్లా కరేలిలో చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవాలన్న తపనతో.. తన ప్రేమను పొందేందుకు ఓ యువకుడు ముస్లిం నుంచి హిందువుగా మారాడు.
Sucide: కూతురు తమ పరువు తీసిందని తట్టుకోలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ మరణానికి కూతురే కారణమంటూ సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి కుటుంబీకులంతా ప్రాణాలు తీసుకున్నారు.