Kamal Haasan: ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్ కులంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కులం తన అతిపెద్ద రాజకీయ ప్రత్యర్థి అంటూ అభివర్ణించారు. ప్రముఖ తమిళ సినీ దర్శకుడు పా.రంజిత్ తన నీలం కల్చరల్ సెంటర్‌లో నీలం బుక్స్‌ని ప్రారంభించిన తర్వాత మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ప్రసంగించారు.
“నా అతిపెద్ద ప్రత్యర్థి, నా రాజకీయ ప్రత్యర్థి కులం, ఇది నేను 21 సంవత్సరాల వయస్సు నుండి చెబుతున్నాను. నేను ఇప్పటికీ చెబుతున్నాను, నా అభిప్రాయం ఎప్పుడూ మారలేదు.” అని కమల్‌హాసన్ చెప్పారు. చక్రం తర్వాత మనిషి సృష్టించిన గొప్ప సృష్టి భగవంతుడు.. మన సొంత సృష్టి మనపై దాడి చేస్తే మనం అంగీకరించలేమని ఆయన అన్నారు.
Lightning strike: క్రీస్తు విగ్రహంపై మెరుపు.. వైరల్ అవుతున్న ఫోటో..
ఈ సందర్భంగా కమల్‌హాసన్‌పై రంజిత్ ప్రశంసలు కురిపించారు. విమర్శకుల ప్రశంసలు పొందేలా సినిమాల్లో నటించారని కమల్ గురించి కొనియాడారు. తన నీలం పుస్తకాల గురించి మాట్లాడుతూ.. రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యేలా, రాజకీయంగా బాధ్యత వహించే పుస్తకాలను మాత్రమే ఉంచాలనుకుంటున్నానని ఆయన చెప్పారు.