Sucide: కూతురు తమ పరువు తీసిందని తట్టుకోలేని ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది. తమ మరణానికి కూతురే కారణమంటూ సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి కుటుంబీకులంతా ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకరమైన ఘటన కర్ణాటకలోని కోలారు జిల్లా హండిగనాళ గ్రామంలో జరిగింది. శ్రీరామప్ప అనే వ్యక్తి తన భార్య సరోజ, కుమారుడు మనోజ్, కూతురు అర్చనతో కలిసి హండిగనాళలో నివసిన్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన డ్రైవర్ నారాయణ స్వామిని రామప్ప కూతురు అర్చన ప్రేమించింది. ఇద్దరి కులాలు వేరు. నారాయణ స్వామి దళిత వర్గానికి చెందిన వ్యక్తి. అర్చన వాళ్లది అగ్రవర్ణానికి చెందిన కుటుంబం. దీంతో సోమవారం అర్చన ఇల్లు వదిలి అతడితో వెళ్లిపోయింది. రామప్ప కుటుంబం వారి విషయాన్ని జీర్ణించుకోలేక పోయారు.
Read Also: Theft Case: 24 ఏళ్ల నాటి కేసు.. రూ.45 కొట్టేసినందుకు 4 రోజుల జైలు శిక్ష
కూతురు కనిపించడం లేదంటూ అదే రోజు రామప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గ్రామంలో తమ పరువు పోయిందని, ఇక తలెత్తుకుని బతకలేమని నిర్ణయించుకున్నారు. తమ మరణానికి కూతురు అర్చన ప్రేమే కారణమని సూసైడ్ నోటు రాసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అదనపు ఎస్పీ కుశాల్ చౌక్సే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంటికి తిరిగి రావాలని లేకపోతే అందరం ఆత్మహత్య చేసుకుంటామని మనోజ్ తన అక్క అర్చనకు పంపిన మెసేజ్ లను ఫోనులో పోలీసులు గుర్తించారు.
Read Also: Ghaziabad: ఇంట్లో పేలిన ఎల్ఈడీ టీవీ.. టీనేజర్ మృతి