హవానా సిండ్రోమ్ వ్యాధిపై ఇండియాలో కూడా కొంత ఆందోళన ఉంది. భారత్‌లో ఈ వ్యాధి వ్యాప్తికి సంబంధించి దేశంలో ఉందా? లేదా? అనేది స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. అనుమానాలు, ఆందోళన మాత్రం ఉంది.
తెలంగాణ సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై సీఐడీ ఎస్పీపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త పేటలోని TSSPDCL సీనియర్ అసిస్టెంట్ కు సీఐడీ ఎస్పీ కిషన్ సింగ్ వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్ పై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది.
వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
సచిన్ తో ప్రేమలో పడి.. నేపాల్ మీదుగా ఇండియాలోకి వచ్చిన సీమా హైదర్ కేసులో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. సీమా ప్రేమికురాలేనా.. లేదా పాకిస్థాన్ గూఢచారా అనే అనుమానాలు తావెత్తుతున్నాయి. సీమా హైదర్ ని ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.
దేశంలోని విపక్ష పార్టీలన్నీ కలిసి కూటమికి I.N.D.I.A అని పేరును పెట్టుకోవడం తెలిసిందే. అయితే ఆ పేరును తప్పుడు ప్రచారంగా వాడుకుంటున్నట్లు పోలీస్ కేసు నమోదైంది. I-N-D-I-A పేరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యూఢిల్లీలోని బరాఖంబ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సోమవారం సుప్రీంకోర్టులో 41 పేజీల అఫిడవిట్‌ను దాఖలు చేసింది. అంతేకాకుండా నిపుణుల కమిటీ మరియు పిటిషనర్ల సిఫార్సులను రికార్డులో ఉంచింది. సెబీ కూడా సుప్రీంకోర్టు నుంచి 'తగిన ఉత్తర్వుల' కోసం చూస్తోంది.