రాజస్థాన్లోని జుంజును జిల్లాలో ఓ అత్యాచార నిందితుడు పోలీసుల కస్టడీలో మృతిచెందాడు. ఈ క్రమంలో.. ఎస్‌హెచ్‌ఓ సహా ఎనిమిది మంది పోలీసులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు. మే 29న మాండ్రేల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. దీంతో పోలీసులపై వేటు పడింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ అత్యాచారం కేసులో కోట్‌పుట్లీకి చెందిన గౌరవ్ శర్మ (30) అనే నిందితుడిని జైపూర్‌లో మే 24న అరెస్టు చేశారు. కాగా.. మరుసటి రోజు…
సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. మనీలాండరింగ్ కేసును ప్రత్యేక న్యాయస్థానం పరిగణలోకి తీసుకుని సమన్లు జారీ చేసినా కూడా నిందితుడిని అరెస్టు చేయాలంటే.. ప్రత్యేక కోర్టు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను గురువారం లేదా వచ్చే వారం విచారించే అవకాశం ఉంది.
కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో తన తమ్ముడిని గెలిపిస్తేనే నీరు సరఫరా చేస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారు.
సార్వత్రిక ఎన్నికల వేల కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆదాయపు పన్ను వివాదంలో న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది.
బెంగళూరులో భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కింద కేసు నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక జ్ఞానభారతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కుటుంబంపై భూ కబ్జా కేసు నమోదయింది.. ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్‌లో ఏ1 గా పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఏ2 గా భార్య నీలిమా, ఏ3 మధుకర్ రెడ్డి పేర్లను చేర్చారు. కొర్రెముల్ల సర్వే నెంబర్ 796లో ప్లాట్లు కబ్జా చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 38ఈ హోల్డర్స్ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కబ్జాకు ప్రయత్నం చేశారని ఫిర్యాదులో తెలిపారు. పదేళ్లుగా 200 మందిని పల్లా రాజేశ్వర్ రెడ్డి నానా…
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' అస్సాంలో కొనసాగుతుంది. కాగా.. ఈ యాత్రను అస్సాం పోలీసులు అడ్డుకున్నారు.. దీంతో గుహవాటి ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. సుమారు 500 మంది కార్యకర్తలతో కలిసి మంగళవారం ఉదయం గుహవాటి నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కాగా.. కాంగ్రెస్ ర్యాలీని అడ్డుకునేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రోడ్లపై బారికేడ్లను ఏర్పాటు చేసి.. నిలువరించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ, బారికేడ్లను దాటుకుని రావడంతో పోలీసులు,…
తెలంగాణలో పది సంవత్సరాల తర్వాత మొదటిసారి సీఐడి కేసు నమోదు అయింది. నకిలీ వీసా, పాస్ పోర్టులు ఇప్పిస్తున్న ముఠాను సీఐడి అధికారులు పట్టుకున్నారు. కాగా.. ఐదు జిల్లాల్లో మూకుమ్మడిగా సోదాలు నిర్వహించింది. తెలంగాణలో సీఐడి అధికారుల దాడులు చేపట్టిన ప్రదేశాల్లో.. హైదరాబాద్, జగిత్యాల, కోరుట్ల, నిజామాబాద్, కరీంనగర్ లలో సోదాలు చేపట్టారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పాస్ పోర్టులు.. విదేశీయులకు పాస్‌పోర్టులు పొందేందుకు అవసరమైన నకిలీ పత్రాలు తయారీ చేస్తుంది ముఠా.