తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం కీలక మలుపు తిరిగింది. గత కొద్దిరోజులుగా నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావు వర్సెస్ యాంటీ కొలికపూడిగా వ్యవహారం మారింది. చిట్టేల సర్పంచ్ ను ఎమ్మెల్యే కొలికపూడి దూషించారని మొదలైన వ్యవహారం సర్పంచ్ భార్య ఆత్మహత్య ప్రయత్నం చేయటంతో పెద్దదైంది. ఆ తర్వాత ఎమ్మెల్యే మీద నిరసనగా తిరువూరు టీడీపీ నేతలు ధర్నాలు చేసి రాష్ట్ర అధ్యక్షుడికి ఫిర్యాదులు కూడా చేశారు. దీంతో సేవ్ తిరువూరు అని సెప్టెంబర్ 30న ర్యాలీ చేద్దామని ఎమ్మెల్యే నిర్ణయించగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడటంతో ర్యాలీ వాయిదా వేస్తున్నట్టు ఎమ్మెల్యే ప్రకటించారు.
Read Also: Mehbooba Mufti: అడాల్ఫ్ హిట్లర్ తర్వాత నెతన్యాహునే అతిపెద్ద ఉగ్రవాది..
అయితే నియోజకవర్గ కార్యకర్తలతో ఇవాళ మీటింగ్ పెట్టుకున్న కొలికపూడి.. తనపై వచ్చిన ఆరోపణలను విచారణ జరిపి నిజమైతే తనను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అబద్ధం అయితే సర్పంచ్, సర్పంచ్ భార్యను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కొలికపూడి శ్రీనివాసరావు ఆకస్మికంగా నిరవధిక దీక్షకు దిగారు. దీంతో ఈ వ్యవహారం పీక్స్ కి వెళ్ళింది. దీనిపై అధిష్టానం ఎలా రెస్పాండ్ అవ్వాలా అని మల్లగుల్లాలు పడుతోంది.
Read Also: Chinta Mohan: లడ్డు విషయాన్ని రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటున్నారు..
ఇటీవల చిట్టెల సర్పంచ్ శ్రీనివాసరావు పేకాట ఆడుతూ దొరికిపోయారు. దీంతో.. అతన్ని టార్గెట్ చేసి ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో సర్పంచ్ భార్య కవిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో.. చికిత్స కోసం ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే తీరుకు వ్యతిరేకంగా స్థానిక టీడీపీ నేతలు కూడా ధర్నా చేశారు. పార్టీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశారు. హైకమాండ్ ఆదేశాలతో సేవ్ తిరువురు ర్యాలీని కూడా ఎమ్మెల్యే విరమించుకున్నారు.