అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్‌లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు.
కొత్వాలి సెక్టార్-24 ప్రాంతంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కంచన్‌జంగా మార్కెట్ సమీపంలో వేగంగా వస్తున్న ఆడి కారు ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందాడు. కారు వేగంగా వచ్చి వృద్ధుడిని ఢీకొట్టడంతో.. కాసేపు గాలిలో ఉండి పది మీటర్ల దూరంలో పడిపోయాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ ప్రమాదంపై మృతుడి కుమారుడు గుర్తు తెలియని డ్రైవర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ముంబైలోని ఘట్ కోపర్ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా 100 అడుగుల హోర్డింగ్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతుంది. ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. బిల్ బోర్డు శిథిలాలు తొలగిస్తుండగా కారులో రెండు మృతదేహాలు బయటపడ్డాయి. వారు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ రిటైర్డ్ మేనేజర్ మనోజ్ చన్సోరియా, ఆయన భార్య అనితగా గుర్తించారు.
అతి వేగం ఎనిమిది మంది ప్రాణాలు తీసింది. వేగంగా వెళ్తున్న ఓ కారు ముందు నిలిపి ఉన్న మరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై రాత్రి 11 గంటలకు ఘటాబిళ్లౌడ్ సమీపంలో చోటు చేసుకుంది.
యూపీలోని ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝాన్సీ-కాన్పూర్ హైవేపై డీసీఎం, కారు ఢీకొన్నాయి. కొద్దిసేపటికే రెండు వాహనాల్లో మంటలు చెలరేగడంతో కారులోని వరుడితో సహా నలుగురు సజీవదహనమయ్యారు.
ఎన్ని కఠినచట్టాలు వచ్చిన కామాంధుల్లో మార్పు రావడం లేదు. పోలీసులన్నా.. చట్టాలన్నా ఏ మాత్రం భయం లేకుండా మానవ మృగాలు ప్రవర్తిస్తున్నారు. రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుంది.
Shocking Study: ఇండియాలో ఆటోమొబైల్స్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా భారత్ ఉంది. ప్రస్తుతం ప్రతీ కుటుంబం కూడా ఒక కారు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇస్తోంది.
బీహార్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భాగల్పూర్లో ట్రక్కు టైర్ పేలి.. కారుపై బోల్తా పడింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందారు. ఘోఘా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆమాపూర్ గ్రామ సమీపంలోని 80వ జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.