నాగాలాండ్ పర్యాటక శాఖ మంత్రి టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన షేర్ చేసిన వీడియోలు యూజర్లకు బాగా నచ్చుతాయి. తాజాగా ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ బామ్మ అద్భుతంగా కారు డ్రైవింగ్ చేస్తోంది. వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమేనని ఈ బామ్మ మరోసారి నిరూపించిందని ట్వీట్ చేశాడు.
మధ్యప్రదేశ్ లోని ఉమారియా జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. తన కారును ఓవర్‌టేక్ చేసినందుకు ఇద్దరు వ్యక్తులను దారుణంగా చితకబాదాడు బాంధవ్గడ్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(SDM). దీంతో అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేశారు.
నోయిడాలో పట్టపగలే దారుణ ఘటన చోటు చేసుకుంది. కారులో వెళ్తున్న వ్యక్తిని బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు గన్ తో కాల్చారు. జిమ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు సూరజ్ భాన్ గా గుర్తించారు. నిందితులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
హనుమకొండ జిల్లా కాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన బైక్ ఎక్కుతున్న ఓ మహిళని అతి వేగంతో వచ్చిన కారు ఢీకొట్టింది. అప్పుడే కాజీపేట సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ నుండి బయటికి వచ్చి బైక్ ఎక్కుతున్న క్రమంలో కవిత అనే మహిళను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Small Plane crashes into car in America: అగ్ర రాజ్యం అమెరికాలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన టెక్సాస్ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శనివారం…
ఉత్తరప్రదేశ్లోని అమేథీ జిల్లాలో ఓ వింత ఘటన వెలుగు చూసింది. అమేథీలో వీఐపీ తరహాలో దొంగలు చోరీకి పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి కారులో వచ్చి మేకల దొంగతనానికి పాల్పడ్డాడు.