ఇండోనేషియాలో ఘోర ప్రమాదం జరిగింది. సుబాంగ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో విద్యార్థులతో సహా 11 మంది ఉపాధ్యాయులు మరణించారు. గ్రాడ్యుయేషన్ ముగించుకుని తిరిగి ఇంటికి బస్సులో వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో ఈ ఘోరం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు స్నాతకోత్సవం ముగించుకుని తిరిగి వస్తుండగా అదుపుతప్పిన బస్సు ప్రమాదానికి గురైంది. శనివారం సాయంత్రం 6:45 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
ఇది కూడా చదవండి: Kareena Kapoor: ఆ పదం వాడినందుకు కరీనా కపూర్ కు షాక్?
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వాహనం బండంగ్‌లోని కొండ రిసార్ట్ ప్రాంతం నుంచి పశ్చిమ జావాలోని డిపోక్‌కు వెళుతున్నప్పుడు (స్థానిక కాలమానం ప్రకారం) సాయంత్రం 6:45 గంటలకు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దిగువ రహదారిపై బస్సు అదుపు తప్పి పలు వాహనాలను ఢీకొట్టిందని పశ్చిమ జావా పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణ ప్రకారం.. బస్సు బ్రేకులు సరిగా పనిచేయడం లేదని నివేదిక పేర్కొంది.
ఇది కూడా చదవండి: Pakistan: ఉగ్రవాదులు-భద్రతా బలగాల మధ్య దాడులు.. ఏడుగురు పోలీసులు మృతి
బస్సులో 61 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో తొమ్మిది మంది మరణించగా.. చికిత్స పొందుతూ మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించారు. మృతుల్లో పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయుడు, ద్విచక్రవాహనదారుడు ఉన్నారు. మరికొందరికి గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో పశ్చిమ జావా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. తీవ్రంగా గాయపడ్డ బాధితులకు 18 శస్త్రచికిత్సలు జరిగాయని చెప్పారు.
ఇది కూడా చదవండి: Kona Venkat: కోన వెంకట్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు