Gurugram: మహిళా పారిశుద్ధ్య కార్మికురాలి పై దూసుకెళ్లిన కారు.. అక్కడికక్కడే మృతి
- మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిపై దూసుకెళ్లిన కారు
- అక్కడికక్కడే మహిళ మృతి
- పరారీలో కారు డ్రైవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. కారు మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఈరోజు ఉదయం.. గురుగ్రామ్‌లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉదయం ప్రమాదం జరిగే ముందు సరోజ్ అనే మహిళా పారిశుధ్య కార్మికురాలు రోడ్డు ఊడుస్తోంది. బాధిత మహిళ తన పని తాను చేసుకుంటుండగా.. వెనుక నుండి దూసుకువచ్చే కారును మహిళ గమనించలేకపోయింది. దీంతో.. కారును డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో మహిళను ఢీకొట్టాడు. బాధితురాలు అక్కడే ప్రాణాలు విడిచింది.
Read Also: Thug Life : కమల్ ‘థగ్ లైఫ్’ షూట్ లో ప్రమాదం..ఆ స్టార్ యాక్టర్ కు గాయాలు.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
చుట్టు పక్కన ఉన్న స్థానికులు ఈ ప్రమాదాన్ని గమనించి.. వెంటనే మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ మహిళ అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. దీంతో.. స్థానికులు ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. కారును స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: BS Yediyurappa: అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తాం: కర్ణాటక మినిస్టర్..
మరోవైపు.. పారిశుద్ధ్య కార్మికురాలి మరణవార్త తెలియగానే తోటి పారిశుద్ధ్య కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీధుల్లోకి వచ్చి పనిచేయకుండ రోడ్లను దిగ్బంధించారు. పారిశుద్ధ్య కార్మికురాలి మృతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. అయితే.. పోలీసులు వారికి సమగ్ర విచారణ జరిపి నిందితుడిని పట్టుకుంటామని నచ్చజెప్పడంతో నిరసన విరమించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా.. ఈ ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న మృతురాలి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు.
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!