ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వచ్చే రెండేళ్ల పాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించడంతో పాటు వీసా జారీపై పరిమితిని విధించింది.
Housing Crisis: కెనడాలో హౌసింగ్ క్రైసిస్ తీవ్రమవుతోంది. అక్కడ ప్రజలు ఇళ్లు దొరక్క తెగ ఇబ్బందుల పడుతున్నారు. కెనడాలో పెరుగుతున్న నిరుద్యోగం, గృహ సంక్షోభంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడి జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలపై అక్కడి ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ మాట్లాడుతూ.. విదేశీ విద్యార్థులపై పరిమితి విధించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు శనివారం వెల్లడించారు. అయితే ఎంతమేర పరిమితి విధిస్తారనే వివరాలను మంత్రి పేర్కొనలేదు.
California: ఖలిస్తానీ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. హిందూ ఆలయాలను టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్న వీరు, మరోసారి ఇలాంటి ఘటనకే పాల్పడ్డారు. అమెరికా కాలిఫోర్నియాలోని హిందూ దేవాలయాన్ని గ్రాఫిటీ పెయింట్స్‌తో ధ్ద్వంసం చేశారు. ఇదే ప్రాంతంలో కొన్ని వారాల క్రితం స్వామినారాయణ మందిరంపై కూడా ఇలాగే దాడికి తెగబడ్డారు. తాజాగా మరోసారి హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారు.
EAM S Jaishankar: భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కెనడా చర్యలను మరోసారి బహిరంగంగా తప్పుపట్టారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీ శక్తులకు పెద్దపీట వస్తోందని, ఖలిస్తానీ శక్తులకు భారత్-కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అనుమతి ఉందని మంగళవారం ఆయన అన్నారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీలకు చోటు ఇవ్వడంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు వారి రాజకీయాలు స్థితి అలా ఉందని వ్యాఖ్యానించారు.
NIA: విదేశాల్లో భారత ఎంబసీలపై దాడికి పాల్పడిన 43 మంది అనుమానితులను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తాన్ మద్దతుదారులు అమెరికా, బ్రిటన్, కెనడాల్లోని భారత రాయబార కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. అనుమానితులందరిని ఎన్ఐఏ క్రౌడ్ సోర్సింగ్ విధానాన్ని ఉపయోగించి గుర్తించింది.
Gurpatwant Singh Pannun: మొన్నటి వరకు ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా-ఇండియాల మధ్య వివాదంగా మారితే.. ప్రస్తుతం మరో ఖలిస్తానీ టెర్రరిస్ట్, సిఖ్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యాయత్నం ఇప్పుడు భారత్-అమెరికాల మధ్య వివాదంగా మారింది. పన్నూను హత్య చేయాలని కుట్ర పన్నినట్లు, ఆ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అయితే ఈ హత్యాయత్నంలో భారత్ ప్రమేయం ఉందని అమెరికా నుంచి ఆరోపణలు వస్తున్నాయి.
Canada: ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది. ఈ హత్య కుట్రలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉందని, భారత్‌కి చెందిన నిఖిల్ గుప్తా అనే వ్యక్తిపై అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తాకు భారత ప్రభుత్వంలోని ఉద్యోగి హ్యండ్లర్‌గా వ్యవహరిస్తూ.. పన్నూ హత్యకు ప్రణాళిక వేశాడని అమెరికన్ న్యాయశాఖ నేరారోపణ పత్రాలు పేర్కొన్నాయి.
Khalistan Terrorist: ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) సంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ హత్య కుట్ర వ్యవహారం భారత్-అమెరికాల మధ్య కొత్త చర్చకు దారి తీసింది. పన్నూను హత్య కుట్రలో భారత ప్రమేయం ఉందని, ఆ కుట్రను భగ్నం అమెరికా భగ్నం చేసినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదించింది. ఈ వ్యవహరాన్ని అమెరికా, అత్యున్నతస్థాయిలో భారత్‌కి తెలియజేసింది. అయితే భారత్ ఇది తమ విధానం కాదని చెప్పింది. ఈ నేపథ్యంలో భారతీయుడైన నిఖిల్ గుప్తా అనే వ్యక్తి…
Gurpatwant Singh Pannun: ఖలిస్తానీ ఉగ్రవాది, ‘సిఖ్ ఫర్ జస్టిస్’ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు, ఈ కుట్రను అమెరికా భగ్నం చేసినట్లు కథనాలు వచ్చాయి. అయితే ఈ కేసులో భారతీయుడిపై అమెరికా అభియోగాలు మోపింది. నిఖిల్ గుప్తా అనే 54 ఏళ్ల వ్యక్తి పన్నూ హత్యకు కుట్ర పన్నాడని అమెరికా ఆరోపిస్తుంది. పన్నూ హత్యకు సంబంధించి అంతకు ముందు యూఎస్ ప్రభుత్వం భారత్‌ని హెచ్చరించింది. అయితే ఇది తమ విధానం…
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారత్ ప్లాన్ చేసిందని, అయితే అమెరికా ఈ కుట్రను భగ్నం చేసిందని ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై అమెరికా తన ఆందోళనను భారత్‌కి తెలియజేసింది. అమెరికా లేవనెత్తిన అంశాన్ని భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. పంజాబ్‌ని భారత్ నుంచి వేరు చేయాలనే ఉద్దేశంతో పన్నూ, కెనడా, అమెరికా, బ్రిటన్ వంటి చోట్ల ఖలిస్తాన్ రెఫరెండానికి…