ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లే విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కెనడాకు చెందిన జస్టిన్ ట్రూడో ప్రభుత్వం వచ్చే రెండేళ్ల పాటు అంతర్జాతీయ విద్యార్థి వీసాలలో కోత విధించడంతో పాటు వీసా జారీపై పరిమితిని విధించింది. కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ ఒట్టావాలో విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కెనడాలో వేగంగా పెరుగుతున్న గృహ సంక్షోభంతో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విద్యార్థి వీసా కోతలు విధిస్తుంది.
Read Also: YSR Aasara Scheme: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. నేడు అకౌంట్లలోకి డబ్బులు
ఇక, ఈ సంవత్సరం కెనడాకు కొత్త స్టడీ వీసాలలో మొత్తం 35శాతం తగ్గించింది. అంటారియో వంటి నిర్దిష్ట ప్రావిన్సులు 50శాతం వరకు మరింత కోతలు విధించాయి. అయితే, మెడిసిన్, లా వంటి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌లతో పాటు మాస్టర్స్- డాక్టరల్ ప్రోగ్రామ్‌లలో చేరిన విద్యార్థుల జీవిత భాగస్వాములకు రాబోయే వారాల్లో ఓపెన్ వర్క్ పర్మిట్లు అందుబాటులో ఉంటాయని మంత్రి తెలిపారు. ఈ ప్రకటనతో కెనడాకు వెళ్లి చదువుకోవాలని కలలు కంటున్న వేలాది మంది భారతీయ విద్యార్థులను నిరాశపరిచింది. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు పంజాబ్- గుజరాత్‌ల నుంచి వెళ్లారు. ప్రస్తుతం కెనడాలో దాదాపు మూడున్నర లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నారు.
Read Also: BCCI Awards 2024: శుభ్‌మన్ గిల్, రవిశాస్త్రిలకు బీసీసీఐ అవార్డులు!
ఇక, కెనడాలో భారత్‌తో సహా అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య మిలియన్ దాటింది. కోవిడ్-19 తర్వాత కెనడా 2023లో రికార్డు స్థాయిలో 5.80 లక్షల స్టడీ వీసాలను జారీ చేసింది. ఇక, కెనడాలో గృహ సంక్షోభం కారణంగా లిబరల్ పార్టీ జస్టిన్ ట్రూడో ప్రభుత్వం విమర్శలకు గురవుతోంది. కెనడాలో తాత్కాలిక నివాసితుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.. దీని కారణంగా ఇంటి అద్దెలు పెరిగాయని నిపుణులు హెచ్చరించారు. తాత్కాలిక నివాసితులలో ఎక్కువ మంది అంతర్జాతీయ విద్యార్థులు, ఇది కెనడాలో గృహ సరఫరాను దెబ్బతీసింది.