Plane Crashes in Canada: కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:50 గంటలకు నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన విమానం ఛార్టర్ ఫ్లైట్ అని విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ పేర్కొంది.
వివరాలు ప్రకారం… రియో టింటో మైనింగ్ సంస్థకు చెందిన దియావిక్ వజ్రాల గని వద్దకు కార్మికులతో పోర్ట్‌స్మిత్ నుంచి ఓ చిన్న విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో విమానంకు సంబంధాలు తెగిపోయాయి. రన్‌వే చివర నుంచి కిలోమీటర్ పరిధిలో విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో ఇంకా తెలియరాలేదు. ఈ ప్రమాదంతో పోర్ట్‌స్మిత్ నుంచి బయలుదేరే అన్ని విమానాలు బుధవారం వరకు నిలిచిపోయాయి.
Also Read: Rohan Bopanna: 43 ఏళ్ల వయసులో చరిత్ర సృష్టించిన రోహన్ బొప్పన్న!
విమాన ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదాన్ని పరిశీలించేందుకు కెనడా రవాణా భద్రతా బోర్డు ఒక బృందాన్ని నియమించింది. ఈ ప్రమాదంపై విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ స్పందించింది. కుప్పకూలిన విమానం ఓ ఛార్టర్ ఫ్లైట్ అని పేర్కొంది. ఆర్జె నార్త్‌వెస్ట్ టెరిటరీస్ ప్రీమియర్ సింప్సన్ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు.