Hardeep Singh Nijjar: ఇండియా-కెనడాల మధ్య తీవ్ర దౌత్య ఉద్రిక్తతలకు కారణమైన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. హత్య జరిగిన 9 నెలల తర్వాత ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సీబీసీ న్యూస్ నివేదించింది. 2020లో భారత్ చేత టెర్రరిస్టుగా గుర్తించబడిన నిజ్జర్, జూన్ 18, 2023న గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్య చేయబడ్డాడు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా నుంచి బయటకు వస్తున్న…
Pakistan: పాకిస్తాన్ పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఘోరంగా తయారైంది. ఓ వైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదం, రాజకీయ అస్థిరత ఇలా ఆ దేశం అనేక కష్టాల్లో చిక్కుకుంది. ఇక ఆ దేశంలోని అన్ని సంస్థలు దాదాపుగా దివాళా అంచుకు చేరుకుంటున్నాయి. ఇందులో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచి పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కూడా ఒకటి. ఇంధన ధరలు పెరిగిపోవడం, అప్పులు ఇలా పీఐఏ ఆర్థిక సమస్యల్లో ఉంది. తమను ఆదుకోవాలని దేశ ప్రభుత్వాన్ని కోరింది.
కెనడాలో గత ఏడాది భారత దౌత్యా అధికారులకు వరుసగా బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. అదే టైంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు అని పేర్కొన్నారు.
India-Canada Row: ఇండియా-కెనడాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. దీనిపై భారత్ ఘాటుగానే స్పందిస్తూ.. ఉగ్రవాదులకు మీరు స్థావరం ఇస్తున్నారని, మీ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకున్నట్టు ఆ దేశ విదేశీ వ్యవహారాల నిఘా సంస్థ కెనేడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ సంచలన ఆరోపణలు చేసింది. భారత్‌తో ముప్పు పొంచి ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది.
Students Died Abroad: ఇటీవల కాలంలో పలు ప్రమాదాల్లో, అనారోగ్య సమస్యలతో పలువురు భారతీయ విద్యార్థులు విదేశాల్లో మరణిస్తున్నారు. తమ బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఎన్నో ఆశలతో తల్లిదండ్రులు విదేశాలకు పంపుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో పేరెంట్స్‌కి కన్నీటిని మిగులుస్తున్నారు. రోడ్డు యాక్సిడెంట్లు, దుండగుల చేతిలో మరణించడం, ఆరోగ్య సమస్యలు కారణంగా మరణాలు చోటు చేసుకుంటున్నాయి.
Canada: కెనడా మరోసారి ఉలిక్కిపడింది. ఆ దేశం ఇప్పటికే భారత వ్యతిరేకత, ఖలిస్తానీలకు అడ్డాగా మారింది. గతేడాది ఖలిస్తానీ ఉగ్రవాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్‌ని కెనడాలోని సర్రే నగరంలోని గురుద్వారా ముందర గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ ఘటన ఇరు దేశాల మధ్య దౌత్యవివాదానికి కారణమైంది.
Viral News: సాధారణంగా ప్రతీ ఏడాది మనం వచ్చే ఏడాది మనం ఎలా ఉంటాము..? ప్రపంచం ఏ విధంగా మారుతుంది..? ఏ కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది..? అని అంచనా వేస్తుంటాం. మరో వందేళ్లకు భూమి ఇలా ఉంటుంది, అలా ఉంటుందని ప్రిడిక్షన్స్ చెప్పడం చూస్తుంటాం. అయితే, 1924 నాటి ఓ న్యూస్ పేపర్ అంచనాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఖలిస్తానీ ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కెనడాను భారత్ హెచ్చరించింది. కెనడా తమ దౌత్య సముదాయాలకు భద్రత కల్పించాలని భారత్ కోరింది.
Plane Crashes in Canada: కెనడాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కార్మికులతో వెళ్తున్న చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ఈ సంఘటన స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:50 గంటలకు నార్త్‌వెస్ట్ టెరిటరీస్‌లో జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కుప్పకూలిన విమానం ఛార్టర్ ఫ్లైట్ అని విమానయాన సంస్థ నార్త్‌వెస్టర్న్ ఎయిర్ పేర్కొంది. వివరాలు ప్రకారం… రియో…