EAM S Jaishankar: భారత విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ కెనడా చర్యలను మరోసారి బహిరంగంగా తప్పుపట్టారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీ శక్తులకు పెద్దపీట వస్తోందని, ఖలిస్తానీ శక్తులకు భారత్-కెనడాల మధ్య సంబంధాలను దెబ్బతీసే అనుమతి ఉందని మంగళవారం ఆయన అన్నారు. కెనడా రాజకీయాల్లో ఖలిస్తానీలకు చోటు ఇవ్వడంపై జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తు వారి రాజకీయాలు స్థితి అలా ఉందని వ్యాఖ్యానించారు.
Read Also: Health Tips : ఈ ద్రాక్షాలను ఎక్కువగా తీసుకుంటున్నారా? ఇది ఒక్కసారి చూడండి..
సెప్టెంబర్ 2023లో న్యూఢిల్లీలో జరిగిన జీ-20 సదస్సులకు కెనడాలోని ఖలిస్తానీ సమస్యకు ఎలాంటి సంబంధం లేదని జైశంకర్ స్పష్టం చేశారు. ఖలిస్తానీ సమస్య కొత్తది కాదని, చాలా ఏళ్లుగా ఉందని ఆయన అన్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కొద్ది మంది ఖలిస్తానీల కోసం భారత్‌తో కెనడా సంబంధాలను పణంగా పెట్టారని భావిస్తున్నారా..? అనే దానికి సమాధానంగా.. ‘‘నేను నా ప్రభుత్వం, నా ప్రధాన మంత్రి గురించి చెప్పగలను, ఇతర ప్రధానుల గురించి ఊహించడం కాదు’’ అని అన్నారు.
ఇక పాకిస్తాన్ గురించి మాట్లాడుతూ.. భారత్‌ని అస్థిరపరిచేందుకు పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందని జైశంకర్ దుయ్యబట్టారు. దశాబ్ధాలుగా పాక్ ఇలాగే ప్రవర్తిస్తోందని, కానీ భారత్ తన విధానాల ద్వారా ఆ చర్యల్ని చిత్తు చేసిందని అన్నారు. ఈ ఏడాడి జూన్ 18న ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్, కెనడాలోని సర్రే నగరంలో కాల్చి చంపబడ్డాడు. ఈ హత్యలో ఇండియా పాత్ర ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.