లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వక్ఫ్ చట్టంపై పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన హింసను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్షాలు హింసను ప్రేరేపిస్తున్నాయని ఆయన ఆరోపించారు. బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ముగ్గురు హిందువులను వారి ఇంటి నుంచి బయటకు లాగి దారుణంగా హత్య చేశారన్నారు. లక్నోలో బాబా సాహెబ్ డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ సమ్మాన్ అభియాన్ కింద నిర్వహించిన రాష్ట్ర వర్క్‌షాప్‌లో బీజేపీ నాయకులను ఉద్దేశించి సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కింద మొదటి దశ పౌరసత్వ ధృవీకరణ పత్రాలు జారీ చేసిన తర్వాత రెండు వారాల లోపే పశ్చిమ బెంగాల్‌లోని లబ్ధిదారులకు సీఏఏ పత్రాలు అందించే ప్రక్రియ ప్రారంభమైంది.
CAA: పౌరసత్వ సవరణ చట్టం(CAA) కింద మొదటిసారిగా 14 మందికి పౌరసత్వ ధృవీకరణ పత్రాలను జారీ చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా సర్టిఫికేట్లను అందించారు.
Amit Shah: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మరోసారి కేంద్ర హోంమంత్రి కాంగ్రెస్, రాహుల్ గాంధీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ప్రతిపక్షాలు రామ మందిరానికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అమిత్ షా ఆరోపించారు.
Chidambaram : కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం ఆదివారం బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించి, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే, పౌరసత్వ సవరణ చట్టం CAAను రద్దు చేస్తామని పి.చిదంబరం అన్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల జోరు సాగుతోంది. ఏడు విడతల్లో పోలింగ్ జరగుతుండగా.. తొలి విడత శుక్రవారమే ప్రారంభంకానుంది. అయితే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. పోలింగ్‌కి రెండు రోజుల ముందు మేనిఫెస్టోను ప్రకటించారు.
Mamata Banerjee: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సి), యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)ని పశ్చిమ బెంగాల్‌లో అమలు చేయబోమని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ పునరుద్ఘాటించారు.