కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) నిబంధనల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. CAA నిబంధనలకు సంబంధించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈరోజు సాయంత్రం నోటిఫికేషన్ విడుదల చేసింది.
పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) సంబంధించి దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. దేశవ్యాప్తంగా సీఏఏపై చర్చ మరోసారి తీవ్రమైంది. ఇంతకు ముందు కూడా పౌరసత్వ సవరణ చట్టంపై చాలాసార్లు వివాదాలు వచ్చాయి.
Citizenship Rules: పొరుగు దేశాల నుంచి మతపరమైన వివక్ష ఎదుర్కొని, అక్కడ మైనారిటీలుగా ఉండీ, భారత్‌లో స్థిరపడిన వారికి పౌరసత్వం ఇచ్చే ‘పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)’ వచ్చే నెలలో అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సీఏఏ అమలు 2019లో దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమైంది. అయితే, ఇటీవల బీజేపీ నేతలు త్వరలోనే సీఏఏ అమలు అవుతుందనే వ్యాఖ్యలు చేశారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పౌరసత్వ(సవరణ)చట్టం(సీఏఏ)పై సంచలన ప్రకటన చేశారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల ముందే అమలు చేస్తామని ప్రకటించారు. 2019లో రూపొందించిన సీఏఏ చట్టాన్ని లోక్‌సభ ఎన్నికలకు ముందు నిబంధనలను జారీ చేసిన తర్వాత అమలు చేస్తామని చెప్పారు. ‘‘మా ముస్లిం సోదరులను తప్పుదారి పట్టిస్తున్నారు. సీఏఏపై రెచ్చగొడుతున్నారు. సీఏఏ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో హింసకు గురై భారతదేశానికి వచ్చిన వారికి పౌరసత్వం ఇవ్వడానికి మాత్రమే ఉద్దేశించబడింది. ఇది ఎవరి…
CAA: కేంద్రమంత్రి, బీజేపీ నేత శంతను ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడు రోజుల్లో దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం (సిఎఎ) అమలులోకి వస్తుందని ప్రకటించారు. రాబోయే ఏడు రోజుల్లో పశ్చిమ బెంగాల్‌లోనే కాదు, భారత్ అంతటా CAA అమలు చేయబడుతుందని నేను హామీ ఇవ్వగలను అని చెప్పారు. బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాస్‌లోని కక్‌ద్వీప్ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ ఈ హామీని ఇచ్చారు.
CAA: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం కోసం ఇప్పటికే రూల్స్ రెడీ అయ్యాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే సీసీఏ కోసం నిబంధనలు జారీ చేయబోతున్నామని, నిబంధనల జారీ తర్వాత చట్టం అమలు చేయబడుతుందని, అర్హులైన వారికి భారత పౌరసత్వం మంజూరు చేయబడుతుందని విషయం తెలిసిన ఓ అధికారి తెలిపారు.
CAA: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం( సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్)(సీఏఏ) అమలును ఎవరూ ఆపలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. బీజేపీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. సీఎం మమతాబెనర్జీ బుజ్జగింపు, చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింసకు పాల్పడుతోందిన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ప్రభుత్వాన్ని గద్దె దించి రాష్ట్రంలో బీజేపీని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు.
Supreme Court set to hear pleas challenging Citizenship Amendment Act (CAA) on September 12: పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ)-2019కి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. సెప్టెంబర్ 12న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ తో కూడిన ధర్మాసనం ఈ అంశానికి వ్యతిరేకంగా నమోదైన 200కి పైగా పిటిషన్లను విచారించనుంది. 2019లో ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీతో పాటు కొన్ని చోట్ల…