India At UN: పాకిస్తాన్ మరోసారి తన నైజాన్ని చాటుకుంది. వేదిక ఏదైనా భారత వ్యతిరేక స్వరాన్ని వినిపించడం మానడం లేదు. తాజా మరోసారి యూఎన్ వేదికగా మరోసారి భారత్‌ని ఉద్దేశించి మాట్లాడింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ రాయబారి మునీర్ అక్రమ్ అయోధ్యలో రామ మందిరం, సీఏఏ గురించి వ్యాఖ్యానించారు. పూర్తి భారత అంతర్గత విషయమైన దీనిపై పాకిస్తాన్ వ్యాఖ్యానించడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యాల్ని ‘‘విరిగిన రికార్డు’’గా అభివర్ణించింది.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సవరించిన చట్టం రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తికి విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో శరణార్థులు చేసిన నిరసనలపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వారంతా జైలులో ఉండాల్సి వారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పౌరసత్వ సవరణ చట్టం-2019(CAA) ప్రకారం అర్హులైన వ్యక్తులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పించే మొబైల్ యాప్‌ను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ శుక్రవారం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
భారత్‌లో అమలవుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై అమెరికా గాయని మేరీ మిల్బెన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. విశ్వాసం కారణంగా చిత్రహింసలకు గురైన ప్రజల పట్ల ప్రధాని మోడీ దయతో కూడిన దృక్పథాన్ని అవలంబిస్తున్నారని, వారికి భారత్‌లో నివాసం కల్పిస్తున్నారన్నారు.
Arvind Kejriwal: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును వ్యతిరేకిస్తూ, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు వచ్చిన శరణార్థుల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కి నిరసన సెగ తగిలింది. తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూ, సిక్కు శరణార్థులు కేజ్రీవాల్ ఇంటి నివాసం వద్ద నిరసనకు దిగారు. అయితే వీరిని ‘పాకిస్తానీలు’ అని పిలిచి మరో వివాదానికి తెరలేపారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA)పై స్టే విధించాలంటూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను కోర్టు మార్చి 19న విచారించనుంది. CAA కోసం కేంద్ర ప్రభుత్వం నిబంధనలను జారీ చేసిన ఒక రోజు తర్వాత, కేరళకు చెందిన రాజకీయ పార్టీ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నిబంధనల అమలుపై స్టే విధించాలని కోరుతూ అత్యున్నత న్యాయస్థానాని ఆశ్రయించింది.
CAA: భారత్ అమలు చేయనున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై పలు దేశాలు, అంతర్జాతీయ సంస్థలు కామెంట్స్ చేస్తున్నాయి. భారత అంతర్గత విషయాల్లో ఎక్కువగా కలుగజేసుకుంటున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఐక్యరాజ్యసమితి హక్కుల విభాగాలు ఈ చట్టం అమలును మతవివక్ష అంటూ వ్యతిరేకిస్తున్నాయి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లలో ముస్లిమేతర మైనారిటీలకు భారత పౌరసత్వం అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే, ఇందులో ముస్లింలను మినహాయించడంపై పలు సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
సీఏఏపై చట్టపరంగా, రాజకీయంగా పోరాడుతామని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPI) రాజ్యసభ ఎంపీ, సీపీఐ కేరళ రాష్ట్ర కార్యదర్శి బినోయ్ విశ్వం గురువారం అన్నారు. సీఏఏ అమలును సవాల్ చేస్తూ ఆయన గురువారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు.