వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటానని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. జగన్ నకిలీ రెడ్డి కాబట్టే ఉయ్యాల వాడ నరసింహ రెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకున్నాడని మండిపడ్డారు. కర్నూలు జిల్లాకు చెందిన జి.పుల్లారెడ్డి రామజన్మ భూమి నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారని తెలిపారు. రెడ్లు అంటే త్యాగానికి దానానికి వీరత్వానికి మారు పేరని బైరెడ్డి పేర్కొన్నారు. రెడ్డి తోక పెట్టుకొని కొందరు నకిలీ రెడ్లుగా చలామణి అవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Byreddy Rajasekhar Reddy: సీమ సమస్యలు పరిష్కరించండి.. రాయలసీమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందేనని స్పష్టం చేశారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి… రాయలసీమకు జరుగుతోన్న అన్యాయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనమే అని ఆందోళన వ్యక్తం చేశారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎందుకు అడ్డుకోరు..? అని ప్రశ్నించారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, కొప్పల జిల్లాలకూ నష్టమే అన్నారు..…
Byreddy Rajasekhar Reddy: రాయలసీమ హక్కుల కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్న రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాయలసీమ సుడిగుండంలో ఇరుక్కు పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాయలసీమ ప్రాంతం వెంటిలేటర్ మీద ఉందంటూ పేర్కొన్నారు.. కర్నూలులో ఇవాళ మీడియాతో మాట్లాడిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు.. తీగల వంతెన వద్దు అంటు ఎమ్యెల్యే…
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పారు. 1994, 1999లో నందికొట్కూరు టీడీపీ ఎమ్మెల్యే. ప్రస్తుతం బీజేపీ నాయకుడు. సొంత పార్టీని విమర్శించకుండానే సంగమేశ్వరం వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఐకానిక్ వంతెనను వ్యతిరేకిస్తూ ఉద్యమం చేపట్టబోతున్నారు. అక్కడ బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలనేది ఆయన డిమాండ్. ఈ ఉద్యమం వెనుక కండువా మార్చే ఎత్తుగడ ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీజేపీకి గుడ్‌బై చెప్పి తిరిగి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు…
రాయలసీమలో కీలక రాజకీయ నేతల్లో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరు. అయితే ఏపీలో ఇటీవల చేపట్టిన కొత్త జిల్లాల ఏర్పాటుపై బైరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోని నాలుగు జిల్లాలు చాలా పెద్దవిగా ఉంటాయని.. అందువల్ల రాయలసీమను 14 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల వైశాల్యం కంటే రాయలసీమ వైశాల్యం పెద్దగా ఉంటుందని బైరెడ్డి పేర్కొన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఒక్కో జిల్లాను నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేయాలని…