Byreddy Rajasekhar Reddy Sensational Comments On Upper Bhadra Project: అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు ఉరితాడు అవుతుందని బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు రూపంలో రాయలసీమకు మరో విపత్తు పొంచి ఉందని పేర్కొన్నారు. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, తొలి విడతలో 5,400 కోట్లు కేటాయించడం దారుణమని మండిపడ్డారు. అప్పర్ భద్రకు వ్యతిరేకంగా సిద్ధేశ్వరం ప్రాజెక్టు సాధన కోసం ఈనెల 25వ తేదీ నుంచి పాదయాత్ర చేపడతామని అన్నారు. 25న ఆర్డీఎస్ నుంచి ఆదోని వరకు పాదయాత్ర చేసి.. 28న ఆదోనిలో భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు. సాగునీటి ప్రాజెక్టుల్లో అన్యాయం జరుగుతుందని, ఇది ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం డిమాండ్‌కు దారి తీస్తుందని హెచ్చరించారు. రాజకీయల కంటే రాయలసీమ ప్రయోజనాలు ముఖ్యమన్నారు. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజి నిర్మిస్తేనే రాయలసీమకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. కేవలం ఐకానిక్ బ్రిడ్జి నిర్మిస్తే రైతులకు ప్రయోజనం లేదని తేల్చి చెప్పారు. అన్ని వర్గాల నుంచి బ్రిడ్జి కం బ్యారేజి నిర్మించాలని మద్దతు లభిస్తోందన్నారు. సిద్ధేశ్వరం అలుగు కోసం చాలా ఏళ్లుగా డిమాండ్ ఉందన్నారు. బ్రిడ్జి కం బ్యారేజి కోసం 12వ తేదీ రాయలసీమలోని 52 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామన్నారు.
INDvsAUS 1st Test: అదరగొట్టిన జడేజా, అశ్విన్.. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 177 ఆలౌట్
అంతకుముందు కూడా రాయలసీమ ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటానికి ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి రావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి – బ్యారేజ్ నిర్మించాలని డిమాండ్ చేసిన ఆయన.. అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోకపోతే, రాయలసీమకు నీటి చుక్క కూడా మిగలదని హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో అత్యంత తక్కువ నీటి పారుదల ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా అని లెక్కలు చెబుతున్నాయన్నారు. 75 ఏళ్లుగా రాయలసీమకు నేతలు మోసం చేస్తూ వస్తున్నారన్నారు.
KTR fire on Revanth Reddy: రేవంత్ దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. శ్రీధర్, భట్టన్నలు మంచోల్లు