Byreddy Rajasekhar Reddy: సీమ సమస్యలు పరిష్కరించండి.. రాయలసీమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందేనని స్పష్టం చేశారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి… రాయలసీమకు జరుగుతోన్న అన్యాయంపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు రాయలసీమకు మరణ శాసనమే అని ఆందోళన వ్యక్తం చేశారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఎందుకు అడ్డుకోరు..? అని ప్రశ్నించారు.. అప్పర్ భద్ర ప్రాజెక్టు కర్ణాటకలో బళ్లారి, రాయచూరు, కొప్పల జిల్లాలకూ నష్టమే అన్నారు.. ఇక, సంగమేశ్వరం వద్ద ఉయ్యాల వంతెన కాదు.. బ్రిడ్జి కం బ్యారేజి కావాలని డిమాండ్ చేశారు.. సీమ సమస్యలు పరిష్కరించకుంటే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాల్సిందే నంటూ మరోసారి ప్రకటించారు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..
Read Also: Congress: థర్డ్ ఫ్రంట్ బీజేపీకి సహాయపడుతోంది.. కాంగ్రెస్ విపక్షాల ఐక్యతకు పనిచేస్తుంది..
కాగా, రాయలసీమ హక్కుల కోసం ఆది నుంచి పోరాటం చేస్తున్న రాయలసీమ స్టీరింగ్ కమిటీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈ మధ్యే సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాయలసీమ సుడిగుండంలో ఇరుక్కు పోయిందని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రాయలసీమ ప్రాంతం వెంటిలేటర్ మీద ఉందంటూ పేర్కొన్నారు.. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తే రాయలసీమకు న్యాయం జరుగుతుందని తెలిపారు.. తీగల వంతెన వద్దు అంటు ఎమ్యెల్యే , ఎంపీలకు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకుండా పోయిందన్నారు.. ఇక, 5,300 కోట్ల రూపాయల వ్యయంతో అప్పరభద్ర ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు.. కానీ, అప్పరభద్ర ప్రాజెక్ట్‌తో రాయలసీమకు తీరని అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు.. ఇక, రాజోలి బండ నుండి పాదయాత్ర కొనసాగిస్తాం అని.. అప్పరభద్ర ప్రాజెక్టు విషయంలో పాలకులకు రాబోయే కాలంలో ప్రజలే బుద్దిచెబుతారని ఈ మధ్యే హెచ్చరించారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి.