Indian companies Q3 earnings: ఇండియన్ కంపెనీలు డిసెంబర్ క్వార్టర్‌లో మంచి ఫలితాలు సాధించాయి. విశ్లేషకుల అంచనాలకు మించి లాభాలు ప్రకటించాయి. ద్రవ్యోల్బణం దిగిరావటం వల్ల రాబడులు పెరిగాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, ఆటోమొబైల్ రంగాలు ఈ ఆదాయ వృద్ధిలో ముందంజలో నిలిచాయి. అదే సమయంలో ఆయిల్, గ్యాస్, మెటల్ సెక్టార్లు వెనుకంజ వేశాయి. ఈ 3 నెలల్లో వస్తుసేవల వినియోగం తగ్గుముఖం పట్టింది.
Not only Adani. But also Ambani: రాజకీయ నాయకుల అండదండల ద్వారానే బిజినెస్‌లో పైకొచ్చాడు తప్ప సొంత తెలివితేటలతో కాదనే విమర్శలు గౌతమ్ అదానీ ఒక్కడి పైనే రాలేదు. గతంలో.. రిలయెన్స్ అధినేత ధీరూబాయి అంబానీ కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టారు. బిజినెస్‌లో బలంగా నిలబడ్డారు. అందువల్ల మన దేశంలో రాజకీయ పార్టీలు మారినా.. ప్రభుత్వాలు మారినా.. రిలయెన్స్ మాత్రం రోజురోజుకీ డెవలప్ అవుతోంది తప్ప డౌన్ కావట్లేదు.
Vostro Accounts ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో ఒకటి.. వోస్ట్రో అకౌంట్లు. వీటినే.. స్పెషల్ రూపీ వోస్ట్రో అకౌంట్లు.. SRVA.. అని కూడా అంటారు. ఇతర దేశాలతో చేసే ఎగుమతులు, దిగుమతులకు పేమెంట్లను రూపాయల్లో నిర్వహించటానికి ఇండియా ఈ సరికొత్త ప్రక్రియకు ఇటీవల శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. భారతదేశం ప్రారంభించిన ఈ నూతన విధానం పట్ల పలు దేశాలు కూడా ఉత్సాహం కనబరుస్తుండటం ఆసక్తికరంగా అనిపిస్తోంది.
Startups Funding Down: 2022లో మన దేశంలో స్టార్టప్‌లకు ఆశించిన స్థాయిలో డబ్బు పుట్టలేదు. 2021వ సంవత్సరంతో పోల్చితే 33 శాతం ఫండింగ్ పడిపోయింది. దీంతో.. గతేడాది సమీకరించిన మొత్తం నిధుల విలువ 24 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. 2021లో అయితే 35 బిలియన్ డాలర్లకు పైగా ఫండ్స్ జమకావటం విశేషం. ప్రపంచ ఆర్థిక మందగమన పరిస్థితుల్లో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్ పట్ల పాజిటివ్‌గానే ఉన్నప్పటికీ క్రితం సంవత్సరం ఇలాంటి క్లిష్ట పరిస్థితి…
Steve Jobs @ Apple: ఈ భూమ్మీద మనుషులు శాశ్వతం కాదు.. వాళ్లు సంపాదించిన పేరే చరిత్రలో కలకాలం నిలిచిపోతుంది. ప్రపంచ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే అలాంటి వ్యక్తుల్లో స్టీవ్ జాబ్స్ ఒకరు. వరల్డ్ వైడ్‌గా యాపిల్ పండు ఎంత పాపులరో యాపిల్ కంపెనీ ప్రొడక్టులు కూడా ఇప్పటికీ అంతే ప్రజాదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. ఆ సంస్థకు కోఫౌండర్‌గా.. సీఈఓగా.. చైర్మన్‌గా ఈ విజయంలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారు.
Indian Stocks: 2022లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు పెద్ద సంఖ్యలో ఇండియాకి గుడ్‌బై చెప్పేశారు. రూ.1.2 లక్షల కోట్ల విలువైన స్టాక్స్‌ను అమ్మేశారు. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో కూడా ఇంత మంది ఫారన్ ఇన్వెస్టర్లు మన మార్కెట్‌ను వీడలేదంటే ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు. పరాయి దేశాల పెట్టుబడిదారులు 2008లో దాదాపు 12 బిలియన్ డాలర్ల విలువైన స్టాక్స్‌ను వదిలించుకోగా ఈసారి పదహారున్నర బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసేసుకున్నారు.
Gold Shine in 2023: బంగారం.. విలువైన లోహం. వన్నె కలిగిన వస్తువు. ఆభరణాల రూపంలో అలంకారం పరంగానే కాకుండా ఆర్థిక కోణంలో కూడా పసిడికి ప్రాధాన్యత ఎక్కువ. అందుకే.. ఎకానమీ అనగానే గోల్డ్ గురించిన ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వర్ణం పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ప్రశ్నకు పరిశీలకులందరూ పాజిటివ్‌గానే సమాధానం ఇస్తుండటం విశేషం.
DHFL Loan Fraud Case: అప్పు చేసి పప్పు కూడు అనే మాట మనం విని ఉంటాం. కానీ.. కొంత మంది ఆ తప్పు కూడు తిని ఉన్నారు. DHFL లోన్ ఫ్రాడ్ కేసును దీనికి లేటెస్టు ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. DHFL.. అంటే.. దివాన్ హౌజింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ సంస్థ యజమానులు లోన్ ఫ్రాడ్ కేసులో ఇరుక్కున్నారు. మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 17 బ్యాంకులతో…
Indian Celebrities Business World: మన దేశం.. సెలబ్రిటీలకు నిలయం. ఆ సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఎక్కువ. పాపులేషన్ ఎక్కువ కాబట్టి ప్రముఖులు కూడా ఎక్కువేనని, వాళ్లకు అభిమానులు అధికమని అనుకోవటానికి లేదు. ఎందుకంటే.. మనకు సహజంగానే సెలబ్రిటీలంటే ఇష్టం మరియు గౌరవం ఎక్కువ ఉండటం దీనికి కారణం. మన దేశంలో ముఖ్యంగా రెండు రంగాల్లో ప్రముఖుల ప్రభావం బాగా కనిపిస్తుంది. ఒకటి.. సినిమా. రెండు.. క్రికెట్. ఈ రెండు రంగాల్లో చాలా మంది రాత్రికిరాత్రే స్టార్లయిపోతారు.
World Bank About India: వచ్చే ఏడాది.. ఇండియా.. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించనుంది. ఈ నేపథ్యంలో.. పాపులేషన్‌కి తగ్గట్లే ప్రాథమిక సౌకర్యాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు వచ్చే 15 ఏళ్లలో.. ముఖ్యంగా.. నగరాలకు ఎన్ని కోట్ల రూపాయల నిధులు కావాలి?, ప్రస్తుతం ఎంత లోటు బడ్జెట్ నెలకొంది? సిటీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చుల్లో దేని వాటా ఎంత అనే విషయాలను వివరిస్తూ ప్రపంచ…