Gas Prices: ప్రభుత్వ రంగానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తాజాగా గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు తీపికబురు అందించాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అయితే ధర తగ్గింపు వల్ల కేవలం కొంత మందికి మాత్రమే ఊరట లభించనుంది. ఎందుకంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును మాత్రమే తగ్గించాయి. సాధారణంగా ఇళ్లలో ఉపయోగించే 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రం స్థిరంగానే కొనసాగించాయి.
Read Also: Petrol Prices: వాహనదారులకు గుడ్‌న్యూస్.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించిన కేంద్రం
తాజాగా కమర్షియల్‌గా ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. 19 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.115.50 మేర తగ్గిస్తున్నట్లు గ్యాస్ కంపెనీలు తెలిపాయి. ఈ తగ్గింపు ధర నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో నేటి నుంచి ఢిల్లీలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ.1,859కి బదులుగా రూ.1,744కే లభ్యం కానుంది. కోల్‌కతాలో 1,995కి బదులుగా రూ.1,846కే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ లభించనుంది. అటు ముంబైలో కమర్షియల్ సిలిండర్ రూ.1844కి బదులుగా రూ.1696కే అందుబాటులో ఉంటుంది. చెన్నైలో రూ.2009.5కి బదులుగా రూ.1893కి అందుబాటులో ఉంటుంది. కాగా డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో డొమెస్టిక్ సిలిండర్ (14.2 కేజీలు) ధర రూ.1105గా ఉంది.