ఈ దీపావళికి బీఎస్ఎన్ఎల్ ధమాకా ఆఫర్ అందిస్తుంది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా కూడా లభించనుంది. ఇదే విషయమై.. బీఎస్ఎన్ఎల్ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపింది. అయితే బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ పోర్టల్‌లో రీఛార్జ్ చేస్తేనే అదనపు డేటా లభించనుంది.
UPI in Sri Lanka: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం శ్రీలంకలో మూడు రోజుల పర్యటనలో ఉన్నారు. గురువారం శ్రీలంకలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆర్థిక మంత్రి ఒక పెద్ద ప్రకటన చేశారు.
Stock Market Crash: భారత స్టాక్ మార్కెట్ వరుసగా ఆరో సెషన్లోనూ భారీ పతనాన్ని కొనసాగించింది. ఈరోజు ప్రారంభ ట్రేడింగ్‌లో బిఎస్ఇ 30 షేర్ల సెన్సెక్స్ 502.5 పాయింట్లు క్షీణించి 63,546.56 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.
భారత్‌లోని డిస్నీ స్టార్ ఇండియా 10 బిలియన్ డాలర్ల నియంత్రిత వాటాను అమ్మివేసేందుకు రెడీ అయింది. అయితే, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 7 బిలియన్ డాలర్ల నుంచి 8 బిలియన్ల డాలర్ల మేర చెల్లించి వాల్ట్ డిస్నీ ఇండియాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అని పలు నివేదికలు పేర్కొన్నాయి.
Accenture: ఆర్థికమాంద్యం, ఆర్థిక మందగమనం కారణంగా గతేడాది నవంబర్ నుంచి ప్రముఖ టెక్ దిగ్గజ కంపెనీలు వేల సంఖ్యలో తమ ఉద్యోగులను తీసేశాయి. కొత్తగా రిక్రూట్మెంట్లను నిలిపేశాయి. కరోనా మహమ్మారి కాలంలో వర్క్ ఫ్రం హోంకి అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని చెప్పాయి, ఒకవేళ ఎవరైనా రాకుంటే ఉద్యోగం ఉండదని హెచ్చరించాయి.
Hurun India Rich List 2023: రిలియన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఇండియా కుబేరుల్లో మొదటిస్థానంలో నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మొదటిస్థానంలో నిలిచారు. గతేడాది మొదటిస్థానంలో అదానీ ఉన్నారు. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలు వచ్చిన తర్వాత గౌతమ్ అదానీ సంపద హెచ్చుతగ్గులకు ప్రభావితమైంది. దీంతోనే ఈ ఏడాది ఇండియా అత్యధిక ధనవంతుల జాబితాలో ముకేష్ అంబానీ అగ్రస్థానంలో నిలిచినట్లు తెలుస్తోంది.
Maruti:ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియాకు ఆదాయపు పన్ను శాఖ నుంచి రూ.2160 కోట్ల నోటీసులు అందాయి. ఈ విషయాన్ని మారుతీ సుజుకీ స్వయంగా వెల్లడించింది. అక్టోబర్ 3, మంగళవారం స్టాక్ ఎక్స్ఛేంజ్కు నోటీసు గురించి సమాచారం ఇస్తూ, పెండింగ్‌లో ఉన్న రూ. 2,160 కోట్ల బకాయిల కోసం ఆదాయపు పన్ను శాఖ నుండి డ్రాఫ్ట్ అసెస్మెంట్ ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలిపింది.
ఆపిల్, గూగుల్ ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మరో కొత్త యాప్ స్టోర్ మార్కెట్ లోకి రాబోతోంది. వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తన మొబైల్ యాప్ స్టోర్‌ను డెవలపర్ల కోపం తీసుకు వస్తుంది. ఇండస్ యాప్‌స్టోర్ అనే పేరుతో ఈ మొబైల్ యాప్ మార్కెట్ ప్లేస్ ప్లాట్ఫామ్లోకి అడుగు పెడుతుంది.
Fertiliser, Labour Cost Hike: ఆగస్టులో వర్షపాతం తక్కువగా ఉండటంతో రైతుల కష్టాలు ఇప్పటికే పెరిగాయి. ఇప్పుడు పెరుగుతున్న కూలీ ఖర్చులు వ్యవసాయాన్ని మరింత కష్టతరం చేశాయి. ఇటీవలి కాలంలో దేశంలో ఆహార పదార్థాల ధరలు భారీగా పెరిగాయి.
Suzlon Energy: రెన్యూవబుల్ ఎనర్జీ సొల్యూషన్ ప్రొవైడర్ కంపెనీ సుజ్లాన్ ఎనర్జీ షేర్లు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. కంపెనీ షేర్లలో ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం కంపెనీకి వచ్చిన కొత్త వర్క్ ఆర్డర్.