Bank Holidays in July 2024 : ఈ రోజుల్లో చాలా వరకు బ్యాంకింగ్ పనులు ఆన్‌లైన్‌లో జరుగుతాయి. బ్యాంక్ మొబైల్ యాప్‌లో అనేక రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇప్పటికీ రుణం తీసుకోవడం వంటి అనేక పనులు ఉన్నాయి, దీని కోసం బ్యాంకు శాఖకు వెళ్లాలి. అయితే బ్యాంకు బ్రాంచ్‌కి వెళ్లి మూసి ఉంటే? మీ పని ఆగిపోతుంది. మీ సమయం కూడా వృధా అవుతుంది. దీన్ని నివారించడానికి, మీ బ్యాంక్ ఎప్పుడు మూసివేయబడుతుందో మీరు ముందుగానే తెలుసుకోవాలి. నెలలో ప్రతి ఆదివారం, రెండవ, నాల్గవ శనివారం బ్యాంకులకు సెలవు. జులై నెలలో మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూసివేయబడతాయి. జూలైలో బ్యాంకులు ఏ తేదీలలో మూసివేయబడతాయో తెలుసుకోండి.
Read Also: Top Upcoming Smartphones: జులైలో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
జులైలో ఈ తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి.
3 జులై 2024: బెహ్ డింక్లామ్ కారణంగా షిల్లాంగ్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
6 జులై 2024: MHIP డే కారణంగా ఐజ్వాల్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
జులై 7, 2024: ఆదివారం, బ్యాంకులకు
8 జులై 2024: కాంగ్ (రథయాత్ర) కారణంగా ఇంఫాల్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
9 జులై 2024: ద్రుక్ప త్షే-జీ కారణంగా గ్యాంగ్‌టక్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
13 జులై 2024: రెండవ శనివారం, బ్యాంకులకు సెలవు
14 జూలై 2024: ఆదివారం కారణంగా, దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
16 జులై 2024: హరేలా కారణంగా డెహ్రాడూన్ జోన్‌లో బ్యాంకులకు సెలవు
17 జులై 2024: మొహర్రం కారణంగా దేశం మొత్తం బ్యాంకులకు సెలవు
21 జులై 2024: ఆదివారం, బ్యాంకులకు
27 జులై 2024: నాల్గవ శనివారం, బ్యాంకులకు సెలవు
28 జులై 2024: ఆదివారం, బ్యాంకులకు వారపు సెలవు