Post Offices: దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిల్స్‌లోని పోస్టాఫీసుల్లో ఉన్న సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గత 19 ఏళ్లలో దాదాపు రూ.96 కోట్లను స్వహా చేశారు. 2002-2021 మధ్య కాలంలో ఈ అవకతవకలు జరిగాయి. ఈ సొమ్ములన్నీ సేవింగ్స్ ఖాతాల్లోని ప్రజాధనమే కావటం గమనార్హం.
UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర నమోదైంది. 2022 జూలైలో 6 బిలియన్లకు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 2016 తర్వాత అంటే గత 6 ఏళ్లలో ఇదే అత్యధికం కావటం విశేషం. యూపీఐ ట్రాన్సాక్షన్లు 2019 అక్టోబర్‌లో తొలిసారి 1 బిలియన్ మార్క్‌ను దాటాయి.
Business Flash: ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ చరిత్రలోనే తొలిసారిగా రెవెన్యూ తగ్గింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒక శాతం ఆదాయం పడిపోయింది. ఒక శాతమంటే దాదాపు ఒక బిలియన్ డాలర్లతో సమానం.
Business Flash: జొమాటో షేర్ల విలువ ఇవాళ భారీగా పతనమైంది. అనూహ్యంగా 14 శాతం పడిపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1000 కోట్లు ఆవిరైంది. ఈ సంస్థ షేర్లు 2021 జూలై 23న స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నమోదైన సంగతి తెలిసిందే.
తీవ్ర ఒత్తిళ్లలో బంగారం మార్కెట్ అమెరికా ద్రవ్యోల్బణం భారీగా ఎగబాకటంతో ఇన్వెస్టర్లు బంగారంపై భరోసాతో పెట్టుబడి పెట్టలేని పరిస్థితి నెలకొంది. గోల్డ్ రేటు కనీసం 100 బేసిస్ పాయింట్లయినా పెరుగుతుందనుకుంటే మార్కెట్ అనూహ్యంగా సుమారు 40 డాలర్లు నష్టపోయింది. పసిడి ధరలు నిన్న తిరిగి కోలుకునే తరుణం�
మన దేశంలో ‘బాష్’ భారీ పెట్టుబడి ఆటోమొబైల్ విడి భాగాల తయారీలో పేరున్న, పెద్ద సంస్థ బాష్ లిమిటెడ్ మన దేశంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.200 కోట్లకు పైగానే (25.12 మిలియన్ డాలర్లు) ఖర్చుచేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగా
దేశ ఆర్థిక వ్యవస్థ స్థితి’గతి’ని మార్చే ‘శక్తి’ ప్రైమ్ మినిస్టర్ (పీఎం) గతిశక్తి పోర్టల్ దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతిని సమూలంగా మార్చనుంది. ఇండియా ఎకానమీని 2040 నాటికి 20 ట్రిలియన్ డాలర్లకు పెంచటమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశలో ఈ నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్‌ఎంపీ) కీలక పాత్ర పోషించనుంది.
నాలుగేళ్లలో మెరుగుపడ్డ ఆర్థిక రంగం గడచిన నాలుగేళ్లలో దేశ ఆర్థిక రంగం పనితీరు స్థిరంగా మెరుగుపడింది. పీహెచ్‌డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (PHDCCI) ఈ విషయాన్ని తెలిపింది. ప్రపంచంలోని టాప్ 10 ఎకానమీలపై విశ్లేషణ జరిపి ఫలితాలను వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఎకనమిక్ రెజిలియెన్స్ (ఐఈఆర్) ర్యా�
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన జాతీయ బ్యాంకులు. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంపు దేశంలోని రెండు జాతీయ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇండియన్ బ్యాంక్‌తోపాటు బంధన్ బ్యాంకు వడ్డీ రేట్లను 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మెచ్యూ�